బెల్లీ ప్యాట్ ను తొందరగా కరిగించే జ్యూస్ లు ఇవి..
నడుము చుట్టు కొలత పెరగడం అంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అయితే కొన్ని జ్యూస్ లు ఈ బెల్లీ ఫ్యాట్ ను తొందరగా కరిగిస్తాయి.
శారీరక శ్రమ లేకపోవడం, ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం, ఒకేదగ్గర కూర్చోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా పెరిగిపోతుంది. ఇక దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇది ఇంచుకూడా తగ్గనివారున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బెల్లీ ఫ్యాట్ ను ఖచ్చితంగా తగ్గించుకోవాలనుకుంటే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. వీటివల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. అయితే కొన్నిరకాల జ్యూస్ లను తాగినా బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
watermelon juice
పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పుచ్చకాయలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
carrot juice
క్యారెట్ జ్యూస్
క్యారెట్లు కేవలం కళ్లకు మాత్రమే మేలు చేస్తాయనుకోవడం తప్పు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. క్యారెట్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, బయోటిన్, పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను తాగితే మీ కళ్లు బాగా కనిపించడంతో పాటుగా ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. క్యారెట్ జ్యూస్ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్ లో 39 కేలరీలు మాత్రమే ఉంటాయి.
beetroot juice
బీట్ రూజ్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.బీట్ రూట్ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఆరోగ్యం బరువు తగ్గొచ్చు.
cucumber juice
కీరదోసకాయ రసం
కీరదోసకాయ రసం మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగితే అతిగా ఆకలి అయ్యే అవకాశం తగ్గుతుంది. ఈ జ్యూస్ ను తాగితే కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.