MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చపాతీని ఎలా తింటే బరువు తగ్గుతారో తెలుసా?

చపాతీని ఎలా తింటే బరువు తగ్గుతారో తెలుసా?

బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా అన్నం తగ్గించి చపాతీలనే ఎక్కువగా తింటారు. ముఖ్యంగా రాత్రిపూట ఓన్లీ చపాతీలనే తింటారు.అయితే ఈ  చపాతీలను నెయ్యితో కలిపి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 31 2024, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా మంది నెయ్యిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటారు. నెయ్యి ఫుడ్స్ ను టేస్టీగా మారుస్తుంది. అంతేకాదు దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొంతమంది నెయ్యిని బాగా తింటే.. మరికొంతమంది మాత్రం తినాలని ఇష్టం ఉన్నా తినకుండా ఉంటారు. కారణం బరువు పెరిగిపోతామని. కానీ దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. మీరు గనుక చపాతీని నెయ్యితో తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అసలు చపాతీని నెయ్యితో తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.. చపాతీని నెయ్యితో తింటే దానిలోని  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు బరువు పెరిగిపోతామన్న భయం అక్కర్లేదు. అందుకే నెయ్యి రొట్టెను తినడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

37


బరువు తగ్గడానికి..

బరువు తగ్గాలనుకునేవారు నెయ్యి జోలికి అస్సలు వెళ్లరు. ఎందుకంటే దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, బరువు మరింత పెరిగిపోతామని అనుకుంటారు. కానీ మీరు  చపాతీపై నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 
 

47

శరీరానికి మేలు..

చపాతీ మీద నెయ్యిని వేసుకుని తింటే బరువు పెరిగిపోతామను అని అనుకుంటే పొరపాటే. అవును ఈ  కాంబినేషన్ చపాతీని తినడం వల్ల  మీరు బరువు పెరగకపోగా మీ శరీరానికి సంబంధించి ఎన్నో  ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

57
ghee

ghee


హార్మోన్ల సమతుల్యం..

చపాతీపై నెయ్యిని వేసుకుని తినడం వల్ల మీ హార్మోన్లు సమతుల్యం అవుతాయి. అలాగే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే నెయ్యి తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 
 

67
ghee

ghee

అతిగా తినరు.. 

నెయ్యి వేసిన చపాతీని తింటే మీకు ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అందుకే ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

77

జీర్ణక్రియకు మంచిది

నెయ్యి,  చపాతీ కాంబినేషన్ మీ బరువును తగ్గించడంతో పాటుగా  జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలను తగ్గించడానికి కూడా ఇది ప్రయోజకరంగా ఉంటుంది.ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని మీరు నెయ్యిని ఎంత పడితే అంత తీసుకోకూడదు. దీని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం నెయ్యిని మోతాదులోనే తీసుకోవాలి. అతిగా తిన్నారంటే సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Khorma: ఈ సండే మరింత స్పెషల్.. క్రీమీ గ్రేవీతో అదిరిపోయే చికెన్ ఖోర్మా
Recommended image2
Kitchen Tips: ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వీటిని అస్స‌లు వండ‌కూడ‌దు.. ఏం జ‌రుగుతుందో తెలుసా.?
Recommended image3
Gutti Vankaya Kothimeera Curry: గుత్తి వంకాయకు కొత్తిమీర టచ్.. రుచి డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved