MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రేషన్ బియ్యంతో ఇడ్లీ, దోశ ఎలా తయారుచేయాలో తెలుసా?

రేషన్ బియ్యంతో ఇడ్లీ, దోశ ఎలా తయారుచేయాలో తెలుసా?

చాలా మంది రేషన్ బియ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అందుకే వీటిని అమ్మేస్తుంటారు. కానీ రేషన్ బియ్యాన్ని అన్నం వండుకుని తినొచ్చు. లేదా ఇడ్లీ , దోష వంటి బ్రేక్ ఫాస్ట్ లు చేసుకుని తినొచ్చు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 17 2025, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

రేషన్ బియ్యం దేనికీ పనికిరావని చాలా మంది అనుకుంటారు. అందుకే వీటిని ఇంటికి తేగానే అమ్మేస్తుంటారు. కానీ రేషన్ బియ్యం కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని అన్నం వండుకుని తినాలంటారు. అయితే చాలా మంది వీటిని అన్నం వండుకుని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు ఈ బియ్యంతో ఎంచక్కా ఇడ్లీ, దోశ వంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లు చేసుకుని తినొచ్చు. అందుకే ఈ రోజు రేషన్ బియ్యంతో ఇడ్లీ, దోశలు ఎలా చేసుకుని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రేషన్ బియ్యంతో ఇడ్లీ, దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం, 1/2 కప్పు మినపప్పు, ఒక టీస్పూన్ మెంతులు. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యాన్ని పోయండి. వీటిని ఐదారు సార్లు నీళ్లతో శుభ్రంగా చేతులతో బాగా కడగిడి నీళ్లు పోసి నానబెట్టండి. అయితే దీంట్లో ఒక టీస్పూన్ ఉప్పును కూడా వేయండి. రేషన్ బియ్యంలో ఉప్పు వేసి నానబెట్టినప్పుడు ఇడ్లీ పిండికి రేషన్ బియ్యం వాసన ఉండదు. ఇందుకోసమే ఉప్పును వేయాలని చెప్తారు.

34

అయితే చాలా మంది ఇడ్లీ బియ్యాన్ని, పప్పును కలిపే నానబెడుతుంటారు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. అందుకే మీరు రేషన్ బియ్యాన్ని, పప్పును, మెంతులను విడివిడిగానే నానబెట్టండి. మినప్పప్పును  ఒక గంటపాటు బయట,  మూడు గంటల పాటు ఫ్రిజ్ లో నానబెట్టండి. మెంతులు, మినపప్పు బాగా నానిన తర్వాత రెండింటిని ఒకేదగ్గర వేడి గ్రైండ్ చేయండి. అయితే మినపప్పులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్ గా వస్తుంది. 
 

44

ఇప్పుడు బియ్యాన్ని గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేసుకోండి. అయితే ఈ రేషన్ బియ్యం సన్న రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు రుబ్బిన మినప్పప్పు పేస్ట్ లో బియ్యం పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఇడ్లీని తయారుచేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు దీనితో దోషలు కూడా చేసుకుని తినొచ్చు. అంతే రేషన్ బియ్యంతో టేస్టీ టేస్టీ ఇడ్లీ, దోషలు తయారైనట్టే. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image2
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image3
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved