MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • నచ్చిన బిస్కెట్లతో జస్ట్ 10 నిమిషాల్లో టేస్టీ టేస్టీ కేక్ తయారీ.. ఎంత ఈజీగా చేయొచ్చో..!

నచ్చిన బిస్కెట్లతో జస్ట్ 10 నిమిషాల్లో టేస్టీ టేస్టీ కేక్ తయారీ.. ఎంత ఈజీగా చేయొచ్చో..!

క్రిస్మస్ అయినా.. న్యూ ఇయర్ అయినా.. కేక్ ను పక్కాగా కట్ చేయాల్సిందేనంటారు చాలా మంది. నిజానికి తియ్య తియ్యని కేక్.. రుచిగా ఉండటమే కాదు.. మనకు పండుగ వాతావారణాన్ని కలిగిస్తుంది. మరీ ఈ రెండు పండుగలకు మీకు నచ్చిన బిస్కెట్లతో చాలా ఈజీగా ఇంట్లోనే కేక్ ను తయారుచేయొచ్చు. అదెలాగంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 20 2023, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
biscuit cake

biscuit cake

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. వీటికి చాలా మంది కేక్ లను కట్ చేస్తుంటారు. వీటికే కాదు పండుగలు, ఫంక్షన్లు, బర్త్ డే, ఇతర పార్టీలకు కూడా కేక్ కట్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ బయట నుంచే అంటే అంతగా ఏం బావుంటుంది. అందులోనూ ఎంతో డబ్బు ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది. అయినా బయట ఎలా తయారుచేస్తున్నారో కూడా తెలియదు. అందుకే చిన్న  చిన్న పార్టీలకు కేక్ లను ఇంట్లోనే తయారుచేసుకోవడం మంచిది. ఇది మీకు ఎక్స్ పీరియన్స్ ను కూడా కలిగిస్తుంది. అయితే మనలో చాలా మంది కేక్ లను తయారుచేయడం పెద్ద ప్రాసెస్ అని.. దీనికి ఎన్నో పదార్థాలు అవసరమవుతాయని అనుకుంటారు. కానీ కొన్ని రకాల కేక్ లను చాలా ఈజీగా తయారుచేయొచ్చు. కేవలం పది ఇరవై నిమిషాల్లోనే తయారుచేసేయొచ్చు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
biscuit cake

biscuit cake

మనం ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్ లో, త్వరగా తయారు చేయగలిగే కేక్ లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో బిస్కెట్లతో తయారుచేసిన కేక్ కూడా ఉంది. నిజానికి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ దీన్ని కేవలం పదే అంటే పదే నిమిషాల్లో తయారుచేయొచ్చు. మరి ఇంకెందుకు  ఆలస్యం ఈ కేక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35
biscuit cake

biscuit cake

బిస్కెట్ తయారీ విధానం 

బిస్కెట్ కేక్ ను తయారు చేయడానికి.. ముందుగా మీకు నచ్చిన బిస్కెట్లను కొనండి. రోలింగ్ పిన్ సహాయంతో 2 బిస్కెట్ ప్యాకెట్లను తెరవకుండా పొడిలా చేయండి. ఆ తర్వాత ఈ విరిగిన బిస్కెట్లను ఒక గిన్నెలో వేయండి. 

45
biscuit cake

biscuit cake

ఇప్పుడు ఈ గిన్నెలో 1 గ్లాసు పాలు పోసి పిండిలా కలపండి. దీన్ని బాగా కలిపిన తర్వాత కొద్దిగా చక్కెర వేయండి. అయితే బిస్కెట్లలో ఆల్ రెడీ చెక్కెర ఉంటుంది. అందుకే తక్కువగా వేయండి. 

ఇప్పుడు ఈ పిండిలో ఈనో వేసి చెంచతో గుండ్రంగా 30 సెకన్ల పాటు తిప్పండి. ఇప్పుడు పిండిపై మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నూనె లేదా వెన్న వేసి కలిపి పెట్టుకున్న కేక్ పిండిని వేయండి. 

55

కావాలనుకుంటే కుక్కర్ లో లేదా ఓవెన్ లో పెట్టి కేక్ ను తయారుచేయొచ్చు. ఈ కేక్ కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఆ తర్వాత కేక్ పై చాక్లెట్ అప్లై చేసి జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఈ పద్ధతిలో కేక్ చాలా స్మూత్ గా వస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
క్రిస్మస్
నూతన సంవత్సరం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది
Recommended image2
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image3
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved