బీపీ తగ్గడానికి ఈ పండ్లను, కూరగాయలను రోజూ తినండి
అధిక రక్తపోటును సకాలంలో గుర్తించకపోయినా.. చికిత్స తీసుకోకపోయినా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది గుండెపోటు నుంచి ఎన్నో ప్రమాకరమైన రోగాలకు కారణమవుతుంది.
Image: Getty Images
అధిక రక్తపోటు అనేది చాలా మందిని ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. రక్తపోటును సకాలంలో గుర్తించకపోవడం మరియు చికిత్స పొందకపోవడం తరచుగా ప్రమాదకరం. రక్తపోటును నియంత్రించడానికి ఆహార మార్పులు అవసరం.
అధిక రక్తపోటు ప్రస్తుత సర్వసాధరణ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు ఈ సమస్య పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటును సకాలంలో గుర్తించాలి. అలాగే చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాల మీదికి వస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే.
బచ్చలికూర
బచ్చలికూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ ఆకుకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు, ఐరన్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ బచ్చలికూర మీ శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.
అరటిపండ్లు
అరటిపండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అందుకే హై బీపీ పేషెంట్లు అరటిపండ్లను తినాలి.
బీట్ రూట్
బీట్ రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బీట్ రూట్ శరీరంలో రక్తాన్ని కూడా పెంచుతుంది.
బెర్రీలు
బెర్రీల్లో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బెర్రీలు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
టమాటాలు
టమాటాలు కూడా రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. 100 గ్రాముల టమాటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అందుకే టమాటాలను తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లు కూడా ఇందుకు సహాయపడతాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్న దానిమ్మ పండ్లు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
క్యారెట్లు
క్యారెట్లు కళ్లకు మాత్రమే కాదు అధిక రక్తపోటును మెరుగ్గా ఉంచడానికి కూడా సహాయపడతాయి. క్యారెట్లు పొటాషియం ఎక్కువగా ఉండే కూరగాయ. అందుకే క్యారెట్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.