Health Tips: రాత్రిపూట వీటిని మాత్రం తినకండి.. లేదంటే?
Health Tips: రాత్రిపూట కొన్ని ఆహారాలను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా ఎన్నో సమస్యలను కూడా కలిగిస్తాయి. అవేంటంటే?
మనం తినే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అంటే మంచి ఆహారాలను తింటే మనం హెల్తీగా ఉంటాం. ఎలాంటి సమస్యలు రావు. అదే చెడు ఆహారాలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మనలో చాలా మంది చేసే తప్పు.. ఉన్నదే తినడం. ఇదే మనం చేసే అతి పెద్ద తప్పు. ఆరోగ్యంగా ఉండేందుకు ఏయే ఆహారాలను తినాలి? ఎప్పుడు తినాలో తెలుసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ఇవి ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నూనెలో వేయించిన ఆహారాలు
రాత్రిపూట పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాలును తినకూడదు. అలాగే నెయ్యి, కొన్ని పాల ఉత్పత్తులు ఉండే ఆహారాలకు కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్
స్పైసీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది రాత్రి డిన్నర్ లో స్పైసీ ఫుడ్స్ నే ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని రాత్రిపూట తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటిని తింటే గుండెల్లో మంట, పెప్టిక్ అల్సర్స్, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
dry fruits
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడంలో ఎలాంటి తప్పులు లేదు. కానీ రాత్రి పూట తినడం మంచిది కాదు. వీటిని రాత్రి ఆహారంతో పాటుగా తినడం, లేకపోతే భోజనం తర్వాత డ్రై ఫ్రూట్స్ ను తింటే మీరు సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఉండే కొవ్వు, క్యాలరీలు మీ బరువును అమాంతం పెంచుతాయి.
కార్బోహైడ్రేట్లు
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా రాత్రిపూట అస్సలు తినకూడదు. రాత్రి భోజనానికి బంగాళాదుంపలు, బియ్యం, పాస్తా వంటి ఆహారాలను ఉపయోగించకండి. ఎందుకంటే ఇవి మీ బరువును అమాంతం పెంచుతాయి.
పెరుగు
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ రాత్రిపూట పెరుగు తినడం అంత మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రాత్రి భోజనంలో పుల్లని పెరుగు తింటే కొందరికి జలుబు చేస్తుంది.
మాంసం
మాంసంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ రాత్రి భోజనంతో పాటుగా మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట మాంసం తక్కువగా తినండి.
చపాతీలు
రాత్రిపూట చపాతీలను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే రాత్రి భోజనంతో పాటుగా గోధుమ పిండితో చేసిన ఏ ఆహారాన్ని కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.