MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • చలికాలంలో బాదం పప్పులు తినొద్దా?

చలికాలంలో బాదం పప్పులు తినొద్దా?

బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని నానబెట్టి తింటే మన శరీరంలో ఎన్నో పోషక లోపాలు పోతాయి. అయితే చలికాలంలో బాదం పప్పులను మరీ ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 22 2023, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పోషకాలు పుష్కలంగా ఉండే గింజల్లో బాదం పప్పులు ఒక్కటి. వీటిలో గుండెకు మేలు చేసే  ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్ మెండుగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ వంటి ముఖ్యమైన పోషకాలు గుండె  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. చలికాలంలో వీటిని తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇతర ఆహారాల మాదిరిగానే బాదం పప్పులను కూడా మరీ ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే బాదం పప్పులను ఎక్కువగా తింటే  ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చలికాలంలో బాదం పప్పులు ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు 

బాదం పప్పుల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు ఎక్కువగా తింటే మీ కేరీరంలో కేలరీల పరిమాణం పెరుగుతుంది. కానీ చలికాలంలో మన శారీరక శ్రమ మాత్రం తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. బరువు పెరగకూడదంటే మాత్రం ఈ సీజన్ లో మీరు బాదం పప్పులను మోతాదులోనే తినాలి.
 

35

బాదం పప్పుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని లిమిట్ లో తినకపోతే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది కడుపు ఉబ్బరం, వాయువు లేదా మలబద్ధకం వంటి సమస్యల బారిన పడేస్తుంది. ముఖ్యంగా మీరు నీళ్లను ఎక్కువగా తాగకపోతే. 
 

45

బాదం పప్పుల్లో ఫాస్పరస్ కూడా పుష్కలంగా ఉంటుంది.  ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. ఇది ఎముకలను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అయినప్పటికీ బాదం పప్పులను మరీ ఎక్కువగా తినడం వల్ల మీలో ఫాస్పరస్ ఎక్కువవుతుంది. ఇది కాల్షియంతో సరిపోలదు. ఇది మీ ఎముకలను ప్రభావితం చేస్తుంది. ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. 

బాదం పప్పులు విటమిన్ ఇ కి అద్బుతమైన వనరులు. అయినప్పటికీ విటమిన్ ఇ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాల సమస్య వస్తుంది. 
 

55

బాదంలో ఆక్సలేట్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది ఎక్కువ మొత్తంలో ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. అందుకే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు బాదం  పప్పులను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఎంత తినాలో తెలుసుకోవాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved