MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఇడ్లీ తింటే ఏమౌతుందో తెలుసా?

ఇడ్లీ తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. నిజానికి ఇడ్లీ మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది కూడా. కానీ దీన్ని తరచుగా తింటే ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Oct 16 2024, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, పూరీ, ఉప్మా వంటివి చేసుకుని తింటుంటారు. అయితే వీటిని ఇడ్లీ అంటే చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొంతమంది మాత్రం వీటినే తింటారు.

బాగా జీర్ణమవుతుందని, ఎలాంటి జీర్ణ సమస్యలు రావని, దీనిలో ఎలాంటి ఆయిల్ ఉండదని తింటుంటారు. ఇంట్లోనే కాదు హోటల్లలో కూడా చాలా మంది  ఇదే ఆర్డర్ చేసుకుని తింటుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిజానికి ఇడ్లీ తినాలనిపించకపోయినా.. ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇడ్లీ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇడ్లీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

దోశ , ఇడ్లీ పిండిని మన శరీరానికి శక్తిని ఇచ్చే బియ్యం, మినపప్పు,  మెంతులు వంటి పదార్థాలతో తయారుచేస్తారు. అందులోనూ దీన్ని నైట్ మొత్తం లేదా 8,9 గంటలు నానబెట్టి తయారుచేసుకుని తింటారు. అంటే ఇది చాలా సేపటి వరకు పులియబెట్టబడుతుంది.

ఈ పిండి కిణ్వ ప్రక్రియ వల్ల మనం ప్రోటీన్, పోషకాలను ఎక్కువగా పొందుతారు. అంతేకాకుండా.. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఇది ఎంచక్కా తినొచ్చు. ఇది జబ్బులున్నవారికి బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. 

35

కేలరీలు తక్కువగా ఉంటాయి

అన్నం, చపాతీ, దోశ, పూరీ వంటి వంటకాలతో పోలిస్తే ఇడ్లీలోనే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అన్నింటికంటే ఇడ్లీనే చాలా సులువుగా జీర్ణం అవుతుంది.

అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఇడ్లీని తింటే మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ఇది మన గట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇడ్లీ బాగా సహాయపడుతుంది. 

ఇడ్లీలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. అంటే దీన్ని తింటే మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. ఇడ్లీని తింటే మీరు అనవసరమైన స్నాక్స్ ను ఎక్కువగా తినకుండా ఉంటారు.

ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. ఇడ్లీలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే ఇది మీ శరీరాన్ని బలంగా, హెల్తీగా ఉంచుతుంది. 
 

45
idli

idli

ఇడ్లీని ఎవరు తినొచ్చు? 

ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవ్వరైనా తినొచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు తినొచ్చు. మీరు చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఘన ఆహారాన్ని ఇచ్చినప్పటికీ.. వారు పుట్టిన 6 నెలల తర్వాత ఇడ్లీని తినిపించొచ్చు. 
 

55

వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు కూడా అల్పాహారంకే కాదు రాత్రి పూట కూడా ఇడ్లీని ఎలాంటి  భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఇడ్లీలో ఉండే ఫైబర్ కంటెంట్ చాలా సులువుగా జీర్ణం అవుతుంది. దీనిలో మినప్పప్పును చేర్చడం వల్ల మహిళల్లో వచ్చే వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Recommended image2
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Recommended image3
Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved