MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • నానబెట్టిన బాదం పప్పులను వరుసగా 7 రోజుల పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

నానబెట్టిన బాదం పప్పులను వరుసగా 7 రోజుల పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

బాదం పప్పులను అలాగే కాకుండా.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే  పరిగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే నానబెట్టిన బాదం పప్పులను మీరు వరుసగా 7 రోజుల పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 21 2024, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన జ్ఞాపకశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయని ఇంట్లో పెద్దలు కూడా చెప్తుంటారు. ఇదొక్కటే కాదు.. బాదం పప్పులను ప్రతిరోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుపడటం నుంచి రోగనిరోధక శక్తి పెరగం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Soaked Almonds

Soaked Almonds

బాదం పప్పుల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో  గ్లైసెమిక్ ఇండెక్స్ మొత్తమే ఉండదు. కాబట్టి ఇది మీ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే వీటిని అలాగే కాకుండా రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరిగడుపున వాటి తొక్కలను తీసేసి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీరు వరుసగా 7 రోజుల పాటు బాదం పప్పులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

36

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. వ్యాధులు రాకుండా ఉంటటానికి రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే బాదం పప్పులను తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నవారు బాదం పప్పులను రోజూ తినాలి. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కుమ మొత్తంలో ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తింటే రెండు వారాల్లో మీ శరీరంలో తేడాను గమనిస్తారు. 

46
soaked almonds

soaked almonds

మెరుగైన జీర్ణక్రియ

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్,విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్, రాగి, జింక్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బాదం పప్పులను నీళ్లలో నానబెడితే ఆల్గేలో ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది

బాదం పప్పులను రోజూ తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇది మీ పిల్లల మెదుడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ నానబెట్టిన బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు మెదడు కణాలను రిపేర్ చేస్తాయి. అలాగే ఐక్యూ లెవెల్స్ ను పెంచుతాయి. మెదడును షార్ప్ గా చేస్తుంది. 

56
almonds

almonds

గుండె ఆరోగ్యానికి బాదం

బాదం పప్పులు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పప్పులు మన శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి. బాదం పప్పుల్లో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

గర్భధారణ సమయంలో 

బాదం పప్పుల్లో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. ఎండిన బాద పప్పు కంటే నానబెట్టిన బాదం పప్పులే చాలా సులువుగా జీర్ణమవుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు నానబెట్టిన బాదం పప్పులను తింటే ఆరోగ్యంగా ఉంటారు. 

66
Soaked Almonds

Soaked Almonds


శరీర అలసటను తగ్గిస్తుంది

బాదం పప్పులు మంచి శక్తి వనరులు. ఈ పప్పుల్లో విటమిన్లు, మినరల్స్, ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీర బలహీనతను పోగొడతాయి. శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తాయి. అంతకాదు నానబెట్టిన బాదం పప్పులను తింటే జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved