MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Food
  • ఒక్క పైనాపిల్ ను తింటే ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?

ఒక్క పైనాపిల్ ను తింటే ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?

పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పైనాపిల్ యాంటీ ఆక్సిడెండ్లకు మంచి వనరు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 22 2023, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
pineapple

pineapple

ఎండాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లలో పైనాపిల్ ఒకటి. నిజానికి పైనాపిల్ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ పండు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా వీటిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పైనాపిల్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పైనాపిల్ లోని పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
pineapple

pineapple

పైనాపిల్ లో విటమిన్ సి,  విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. 905 గ్రాముల పైనాపిల్ లో 452 కేలరీలు, 119 గ్రాముల కార్బోహైడ్రేట్, 13 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల పోటిన్ ఉంటాయి. అంతేకాదు వీటిలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, రాగి, విటమిన్ బి 6, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  పైనాపిల్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య  ప్రయోజనాలు కలుగుతాయంటే..? 

38
pineapple

pineapple

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొల్లాజెన్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

48
pineapple

pineapple

జీర్ణక్రియ

పైనాపిల్ తినడం జీర్ణక్రియకు చాలా మంచిది. పైనాపిల్ లో 'బ్రోమ్లిన్ ' అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సులువుగా జీర్ణం అవుతుంది. 

58

ఎముకల ఆరోగ్యం

పైనాపిల్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పైనాపిల్ లో ఎముకల ఎదుగుదలకు అవసరమైన మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కాగా సయాటికా ఉన్నవారు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడానికి కూడా పైనాపిల్ సహాయపడుతుంది.
 

68
<p>pineapple fruit</p>

<p>pineapple fruit</p>

గుండె ఆరోగ్యం

ఫైబర్ పుష్కలంగా ఉండే పైనాపిల్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పైనాపిల్ లో ఉండే బ్రోమ్లిన్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పైనాపిల్ లో ఉండే పొటాషియం కూడా రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

78

వెయిట్ లాస్

పైనాపిల్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా సహాయపడుతుంది. పైనాపిల్ లో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పైనాపిల్ ను ధైర్యంగా తినొచ్చు.
 

88
Pineapple

Pineapple

డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తినొచ్చా?

పైనాపిల్ లో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ.. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను మందగించడానికి సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు పైనాపిల్స్ తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మితంగా మాత్రమే తినాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved