చలికాలంలో పల్లీలను తింటే ఏమౌతుంది?
చలికాలంలో పల్లీలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పల్లీల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. మరి చలికాలంలో వేరుశెనగలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?
పల్లీలు పోషకాలకు మంచి వనరులు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. వేరుశెనగలను రోజూ గుప్పెడు తింటే మన రోగనిరోధక శక్తి ఇట్టే పెరిగిపోతుంది. దీంతో మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వేరుశెనగల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ పోషకాలు చలికాలంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వేరుశెనగల్లో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక చలికాలంలో మన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ సీజన్ లో పల్లీలను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం.
చలికాలంలో అలసట సమస్య కూడా పెరుగుతుంది. అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ శక్తి కోసం వేరు శెనగలను తినండి. ఇవి మీకు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఇవి మన శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని కూడా మారుస్తాయి.
చలికాలంలో వేరుశెనగలను తినడం వల్ల మన శరీరం వెచ్చగా ఉంటుంది. అంటే వీటిని తింటే ఈ సీజన్ లో చలి మరీ ఎక్కువగా పెట్టదన్న మాట. అంతేకాదు పల్లీలు మన ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.
peanuts
పల్లీల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే ఇవి చలికాలపు అలసట నుంచి ఉపశమనం కూడా కలిగిస్తాయి. వైద్య పరిభాషలో దీనిని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. వేరుశెనగలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది.