MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • మీరు కాలీఫ్లవర్ ను తింటరా? అయితే ఈ ముచ్చట తెలుసుకోవాల్సిందే

మీరు కాలీఫ్లవర్ ను తింటరా? అయితే ఈ ముచ్చట తెలుసుకోవాల్సిందే

కాలీఫ్లవర్ పోషకాల బాంఢాగారం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాలీఫ్లవర్ క్యాన్సర్ నుంచి ఎముకలను బలంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
cauliflower

cauliflower

కాలీఫ్లవర్ క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందింది. ఈ కూరగాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాలీఫ్లవర్ తెలుపు, ఆకుపచ్చ, ఊదా వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఇది విటమిన్ సి మంచి వనరు. ఈ కూరగాయలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడే సల్ఫోరాఫేల్, ఇండోల్ -3 కార్బినోల్, గ్లూకోసినోలేట్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్లకు మంచి మూలం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఒక కప్పు కాలీఫ్లవర్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ శరీర కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయను డైట్ లో చేర్చుకోవచ్చు. 

35

ఈ కూరగాయ మధుమేహులకు కూడా మంచి మేలు చేస్తాయి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడాని బాగా సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే కాలీఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుండి బయటపడటానికి, గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

45

కాలీఫ్లవర్ లో ఇండోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కాలెయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలీఫ్లవర్ లో సల్ఫోరాఫేన్ అని పిలువబడే మొక్కల సమ్మేళనం ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కూరగాయ. కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

55

కాలీఫ్లవర్ లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో భాగాలు ఉంటాయి. కాలీఫ్లవర్ లో గ్లూటెన్ ఉండదు. ఈ కూరగాయ జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పోషకాల వనరు. కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఏదేమైనా దీనిని అతిగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved