రేగుపండ్లు తింటే ఏమౌతుందో తెలుసా?
సీజన్ ను కు అనుగుణంగా పండ్లు, కూరగాయలను తినడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. మరి చలికాలంలో దొరికే రేగుపండ్లను తింటే ఏమౌతుందో తెలుసా?
రేగుపండ్లు ఒక్క చలికాలంలోనే కాస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండులో ఆరెంజ్ కంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు మన ఆరోగ్యాన్ని, చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది. అసలు చలికాలంలో రేగుపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రేగుపళ్లు
ఈ పండ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా సులువుగా తినొచ్చు. ఈ పండ్లను చైనీస్ ఖర్జూరాలు అని కూడా ఉంటారు. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్లు, పాలిసాకరైడ్లు, ట్రైటెర్పెనిక్ ఆమ్లాలు వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.
Jujube Fruits
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
రేగుపండ్లను తింటే నిద్రలేమి సమస్య చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ఎన్నో ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి మన నిద్ర నాణ్యతను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ఈ పండ్లను తింటే మన మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. రేగుపండ్ల గింజల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా మన నిద్ర సమయం పెరిగినట్టు పలు అధ్యయనాల్లో తేలింది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో రేగుపండ్లను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రేగుపళ్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని కనుగొన్నారు. ఈ వింటర్ ఫ్రూట్ లో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
indian jujube
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రేగుపండ్లలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా తొందరగా జీర్ణమవుతాయి. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను ఈజీగా తగ్గిస్తుంది.
రేగుపండ్లను తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
రేగుపండ్లలో పొటాషియం ఎక్కువగా, ఉప్పు ఉంటుంది. అంటే ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
అలాగే ఈ పండ్లు నాడీ వ్యవస్థ, మెదడు విధులను నియంత్రిస్తుంది. యాంగ్జైటీని తగ్గిస్తుంది.
రేగుపండ్లలో ఉండే ఐరన్, ఫాస్పరస్ లు మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.అలాగే దీనిలోని కాల్షియం కంటెంట్ ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
రేగుపండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లు గాయాలను త్వరగా నయం చేస్తాయి.