చలికాలంలో ఖర్జూరాలను ఎలా తింటే మంచిదో తెలుసా?
చలికాలంలో ఖర్జూరాలను రోజూ తినాలంటారు డాక్టర్లు. ఖర్జూరాలు శరీరాన్ని వేడిగా ఉంచి, మంచి ఎనర్జీని అందిస్తాయి. కానీ ఖర్జూరాల ప్రయోజనాలు పొందాలంటే మాత్రం వీటిని కొన్ని విధాలుగా తినాలి.
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మన శరీరానికి అవసరమైన పోషకాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సీజన్ లో పాలు, డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలను, సూప్ ను ఖచ్చితంగా చేర్చాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో ఖర్జూరాలు ఒకటి.
Benefits of Dates
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికలంలో ఖర్జూరాలను తినడం చాలా మంచిది. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని చలికాలంలో ఎన్నో రోగాల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఈ డ్రై ఫ్రూట్ లో విటమిన్ డి, ప్రోటీన్లు, కాల్షియం, నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో రోజుకు ఒక నాలుగైదు ఖర్జూరాలను తింటే మీ శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో మీకు చలి తక్కువగా పెడుతుంది. అలాగే మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. ఖర్జూరాలను తింటే మీ శరీరంలో పోషకాల లోపం కూడా పోతుంది. అసలు చలికాలంలో ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎముకలను బలంగా చేస్తుంది
చలికాలంలో లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఈ సీజన్ లో రోజూ నాలుగైదు ఖర్జూరాలను తింటే మాత్రం మీ ఎముకలు బలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరాలు మీ శరీరంలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతాయి.అలాగే ఈ ఖర్జూరాల్లో ఉండే కాల్షియం దంతాలను, ఎముకల్ని బలంగా ఉంచుతాయి. ఈ డ్రై ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ లు మీ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దీంతో మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. అయితే చలికాలంలో ఖర్జూరాలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ సీజన్ లో రోజూ ఉదయం పరిగడుపున ఖర్జూరాలను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి దగ్గు, జలుబుకు దూరంగా ఉంటారు. అంతేకాదు ఇది మీ శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం
చాలా మందికి చలికాలంలో మలబద్దకం సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే ఖర్జూరాలు ఈ సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఉదయాన్నే పరిగడుపున ఖర్జూరాలను తింటే కొన్ని రోజుల్లోనే మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు రాత్రిపూట కొన్ని ఖర్జూరాలను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపున తినండి.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సీజన్ లో ఖర్జూరాలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాలను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందుకోసం మీరు ఖర్జూరాలను ఉదయమైనా, సాయంత్రమైనా తినొచ్చు.
రక్తం లోపం తగ్గుతుంది
ఖర్జూరాలను తింటే శరీరంలో శరీరంలో రక్తం పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఖర్జూరాలు ఉపయోగకరంగా ఉంటాయి. రాత్రంతా ఖర్జూరాలను నీళ్లలో నానబెట్టి వీటిని ఉదయాన్నే పాలు లేదా నెయ్యితో కలిపి తినాలి. ఇలా చేస్తే ఒంట్లో రక్తం పెరుగుతుంది.
చలికాలంలో ఖర్జూరాలను ఎలా తింటే మంచిది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో ఖర్జూరాలను పాలలో కలిపి తింటే మంచిది. దీనివల్ల మీకు రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండింటిలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. దీనితో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. ఖర్జూరాలను పాలతో కలిపి తింటే మీకు ఎన్నో వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అయితే మీరు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తినడం మంచిది.