MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మంచిది కాదని వంకాయను తినకపోతే ఏమౌతుందో తెలుసా?

మంచిది కాదని వంకాయను తినకపోతే ఏమౌతుందో తెలుసా?

కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు  వంకాయను తినకూడదనేది వాస్తవం. అలా అని అందరూ తినొద్దని కాదు. కానీ వంకాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 26 2024, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
brinjal

brinjal

వంకాయ హెల్తీ కూరగాయ. ఒకప్పుడు దీనితో ఒక్క ఇండ్లలోనే కాదు హోటళ్లలో కూడా వారానికి ఒకసారైనా వంకాయ సాంబారును చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది దీన్ని పూర్తిగా వండటమే మానేసారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
brinjal

brinjal

ఒక్కప్పుడు బిర్యానీలోకి మసాలా వంకాయను వండేవారు. ఇప్పుడు ఇది చూద్దామన్నా కరువైంది. నిజానికి ఈ చిన్న వంకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వంకాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో అవసరమవుతాయి. అసలు వంకాయ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వంకాయలో విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్  బి 3, విటమిన్ బి 5, విటమిన్ బి 6, విటమిన్ బి 9, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె  లతో పాటుగా 5.88 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 3.53 గ్రాముల నేచురల్ షుగర్, 0.18 గ్రాముల కొవ్వు, 0.98 గ్రాముల ప్రోటీన్ లు ఉంటాయి. అలాగే దీనిలో ఐరన్, కాల్షియం, జింక్, మాంగనీస్ లు కూడా మెండుగా ఉంటాయి. 
 

35


విటమిన్, మినరల్ లు 

వంకాయల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వంకాయను తింటే మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే అధిక రక్తపోటును నియంత్రించే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. వంకాయను తరచుగా తింటే శరీరంలో పోషకాల లోటు తీరుతుంది. 

షుగర్ వ్యాధికి వంకాయ

ఇండియాలో దాదాపుగా 80 మిలియన్ల మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వంకాయ డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీనిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మీ ఆహారంలో వంకాయను చేర్చడం వల్ల డయాబెటీస్ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ మన శరీరం చక్కెరను సులువుగా గ్రహించనివ్వదు. వంకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
 

45

బరువు తగ్గడానికి వంకాయ

వంకాయ బరువు తగ్గాలనుకునేవారికి కూడా బాగా సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ డైట్ లో వంకాయను తప్పకుండా చేర్చండి. ఈ కూరగాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అతిగా తినలేరు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

బలమైన ఎముకలు

వంకాయను తింటే పిల్లల, పెద్దల ఎముకలు బలంగా ఉంటాయి.వంకాయను తింటే వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వంకాయను తింటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. వంకాయలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియంలు ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. 
 

55

కంటి చూపునకు మంచిది

ఎలక్ట్రికల్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటిచూపు దెబ్బతినడమే కాకుండా కంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే మీరు వంకాయను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. వంకాయ కళ్లలోని కణజాలానికి మేలు చేస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Recommended image2
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Recommended image3
ఈ సండే ఇంట్లో ద‌బ్బిడి దిబిడే.. చికెన్ ఫ్రై ఇలా చేస్తే, ఇంట్లో వాళ్లు ఫిదా అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved