పసుపు ఎక్కువగా వాడితే కడుపు నొప్పి వస్తుందా?
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ఏండ్ల కాలం నుంచి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. పసుపులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. పసుపు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. దీన్ని మోతాదులో వాడటమే మంచిది. ఎందుకంటే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
turmeric
పసుపును మనం ప్రతిరోజూ కూరల్లో వేస్తూనే ఉంటాం. ఇది కూరలకు మంచి రంగును ఇచ్చినా.. మన ఆరోగ్యానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. పసుపులో దివ్య ఔషధ గుణాలు దాగున్నాయి. దీనిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పసుపును ఉపయోగించి శరీర మంట నుంచి ఆక్సీకరణ ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే పసుపును ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇక ప్రతిరోజూ పడుకునే మందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే హాయిగా నిద్రపట్టడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే పసుపును మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ దీన్ని హెవీగా ఉపయోగిస్తేనే ఎన్నో సమస్యలు వస్తాయి. పసుపులో ఐరన్, జింక్, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, రాగి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఈ పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పసుపు
ఉదర సమస్యలు
పసుపుతో కూడా ఉదర సమస్యలను తగ్గించుకోవచ్చంటారు నిపుణులు. కానీ దీన్ని మరీ ఎక్కువగా వాడితే మాత్రం పసుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. లిమిట్ కంటే ఎక్కువ పసుపును తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. అలాగే కడుపు తిమ్మిరి సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు
మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం
కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి మాటల్లో చెప్పలేం. అయితే పసుపు కూడా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కిడ్నీ పేషెంట్లు పసుపును మోతాదులోనే తినాలి. అలాగే దీన్ని తీసుకునే ముందు డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించాలి.
పసుపు
వికారం, విరేచనాలు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే మీరు పసుపును మరీ ఎక్కువగా తీసుకుంటే వికారంతో పాటుగా విరేచనాల సమస్య కూడా వస్తుంది.
పసుపు
అలర్జీలు
కొన్ని కొన్ని సార్లు పసుపు వల్ల అలెర్జీ కూడా వస్తుంది. పసుపులో ఉండే కొన్ని సమ్మేళనాలే అలెర్జీలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపును చర్మానికి అప్లై చేయడం వల్ల కొందరికి దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.
పసుపు
డయాబెటిక్ పేషెంట్లు జాగ్రత్త
మధుమేహులకు పసుపు అంత మంచిది కాదు. అయితే డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ చిక్కగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వీళ్లు మందులను వాడుతుంటారు. అయితే పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మందులను వాడి, పసుపును తీసుకుంటే డయాబెటీస్ పేషెంట్ల రక్తం మరీ పల్చగా మారుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే మందులను వాడే డయాబెటీస్ పేషెంట్లు పసుపును తీసుకోవడం మానేయాలి.