సమ్మర్ వేడి తగ్గించేందుకు కీరదోస.. కానీ తర్వాత..
వీటితో పాటు 95శాతం నీరు కూడా ఇందులో ఉంటుంది. ఇది మన చర్మానికీ.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కానీ.. తిన్న తర్వాత మంచినీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలేవీ దక్కుండా పోతాయి.
ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలు ఒకేసారి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో ఆ రెండింటినీ తట్టుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
మరీ ముఖ్యంగా ఈ ఎండ వేడి తట్టుకోవడానికి మంచినీరు ఎక్కువగా తాగడం.. నీరు ఎక్కువగా ఉండే.. కీరదోస తినడం చాలా అవసరం. ఈ రెండు.. శరీరాన్ని కూల్ చేసి.. ఎండ వేడి తగ్గించడానికి మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. అయితే... కీర దోస తిన్న తర్వాత.. మంచినీరు మాత్రం తాగకూడదట.
మీరు చదివింది నిజమే.. ఈ సమయంలో కీరదోస తినడం చాలా ముఖ్యం. కానీ.. దానిని తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా అవసరమని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీరదోస లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే.. కీరదోస తిన్న తర్వాత మంచినీరు మాత్రం తాగకూడదు. అలా తాగడం వల్ల దానిలోని న్యూట్రియంట్స్ శరీరానికి చేరుకోవు. అంతేకాకుండా.. మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
కీరదోసలో న్యూట్రియంట్స్.. విటమిన్ సీ, విటమిన్ కే, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి.
వీటితో పాటు 95శాతం నీరు కూడా ఇందులో ఉంటుంది. ఇది మన చర్మానికీ.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కానీ.. తిన్న తర్వాత మంచినీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలేవీ దక్కుండా పోతాయి.
కీరదోస తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. కానీ తర్వాత వాటర్ తాగడం వల్ల నీళ్ల విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. కీర దోస తిన్న తర్వాత కనీసం అరగంట వరకు మంచినీరు తాగకూడదు.
కేవలం కీరదోస మాత్రమే కాదు.. నీరు ఎక్కువగా ఉంటే పుచ్చకాయ, పైనాపిల్ లాంటివి తిన్న తర్వాత కూడా వెంటనే మంచినీరు తాగకూడదు. కనీసం అరగంట బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం.
మనం తీసుకున్న ఆహారం అరగడానికి పీహెచ్ లెవల్ చాలా అవసరం. కానీ వీటిని తీసుకున్నతర్వాత వాటర్ తాగడం వల్ల పీహెచ్ లెవల్ తగ్గిపోవడంతోపాటు.. కడుపులో యాసిడ్ ఫాం అయ్యే ప్రమాదం ఉంది.
కీరదోసలోని అన్ని న్యూట్రియన్స్ మీకు అందాలంటే.. దానికి మంచినీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అరగంట గ్యాప్ ఇచ్చి తాగితే మంచిది.