పులిసిపోయిన పెరుగుతో ఇన్ని వంటలు చేయచ్చా..?
చాలా మంది పెరుగు కాస్త పులుపు ఎక్కినా తినడానికి ఇష్టపడరు. అయితే.. అలా మిగిలిపోయిన పెరుగుతో కూడా అద్భుతంగా, రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
curd
చాలా మందికి ఎన్ని కూరలతో, రకరకాల వంటలతో భోజనం పెట్టినా.. లాస్ట్ లో ఒక్క ముద్ద అయినా పెరుగుతో తినకపోతే భోజనం పూర్తవ్వదు. కొందరికి పెరుగు తియ్యగా ఉంటే తినడం ఇష్టం. కొందరికి పుల్లగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. పెరుగు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అయితే.. చాలా మంది పెరుగు కాస్త పులుపు ఎక్కినా తినడానికి ఇష్టపడరు. అయితే.. అలా మిగిలిపోయిన పెరుగుతో కూడా అద్భుతంగా, రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
1.పెరుగన్నం..
మీరు చదివింది నిజమే. పెరుగు పులిసిపోయి పుల్లగా మారిన తర్వాత.. దాంట్లో అన్నం కలిపాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పోపు గింజలు, కరివేపాకు వేసి పోపు పెడితే సరిపోతుంది. కమ్మని భోజనం రెడీ అవుతుంది.
2.పెరుగు పరాటా..
పెరుగు ఉంటే కమ్మని రుచికరమైన పరాటా కూడా చేయవచ్చు. నీటికి బదులు పెరుగుతో పరాటా పిండి కలుపుకొని ఎప్పటిలాగా పరాటా చేసుకోవడమే. కానీ రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. పరాటాలు మెత్తగా వస్తాయి.
3.పెరుగు శాండ్ విచ్..
పెరుగును మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న పెరుగుతో పాటు.. శాండ్ విచ్ లోకి మీరు తినగలిగే కూరగాయ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఎప్పటిలాగా మీరు చేసుకునే శాండ్ విచ్ లాగానే చెయ్యాలి. కానీ.. రెండు బ్రెడ్ ముక్కుల మధ్య కూరతో పాటు.. ఒక లేయర్ లాగా బ్లెండ్ చేసుకున్న పెరుగు రాయాలి. తర్వాత కూరగాయ ముక్కలు పెట్టాలి. ఈ శాండ్ విచ్ చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది.
4.పెరుగుతో ఐస్ క్రీమ్..
మీరు ఇప్పటి వరకు పాలతో ఐస్ క్రీమ్ చేసుకొని రుచి చూసి ఉండొచ్చు. కానీ.. పెరుగుతో కూడా ఈ ఐస్ క్రీమ్ ని రుచిగా తయారు చేసుకోవచ్చు. దాని కోసం మీరు పెరుగును మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అందులో మీకు నచ్చిన పండ్లు, లేదంటే సిరప్స్ కలిపి.. ఫ్రీజ్ చేయాలి. అంతే.. టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే..
fruit salad
5పెరుగుతో ఫ్రూట్ సలాడ్..
పాలతో ఫ్రూట్ సలాడ్ చేసి ఉండొచ్చు. క్రీమీగా బ్లెండ్ చేసిన పెరుగుతో కూడా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. అదనంగా రుచి కోసం తేనె కూడా జత చేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.
Image: Getty Images
6.ఫ్రూట్ స్మూతీస్..
పెరుగుతో రుచికరమైన స్మూతీస్ కూడా చేసుకోవచ్చు. పండ్లను పెరుగుతో కలిపి బ్లెండ్ చేయాలి. దాంట్లో కొద్దిగా పాలు, కొంచెం తేనె వేసి..రుచి కరమైన, పోషకాలతో కూడిన స్మూతీస్ తయారు చేసుకోవచ్చు.
7.పెరుగుతో దోశ..
పెరుగుతో దోశ, ప్యాన్ కేక్స్ కూడా తయారు చేసుకొని కమ్మని బ్రేక్ ఫాస్ట్ గా మార్చుకోవచ్చు. పెరుగులో మైదా కానీ, గోధుమ పిండి, జొన్న పిండి ఏదైనా పిండిని వేసి కలపాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి... తర్వాత దోశలు వేసుకుంటే కమ్మగా ఉంటాయి.