MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ ఉదయాన్నే గంజి తాగితే ఏమౌతుంది..?

రోజూ ఉదయాన్నే గంజి తాగితే ఏమౌతుంది..?

 రాత్రిపూట వండిన అన్నం నుంచి వార్చిన గంజిని.. ఉదయాన్నే తాళింపు పెట్టుకొని తాగితే మరింత రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 06 2024, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rice water

rice water

 

ఈ రోజుల్లో గంజి తాగేవాళ్లు ఎవరైనా ఉన్నారా..? పూర్వం మన పెద్దవాళ్లు అన్నం వండేటప్పుడు.. గంజి వార్చి వండేవాళ్లు. ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకొని తాగేవారు. కానీ ఈ రోజుల్లో అసలు గంజి వంచి అన్నం వండుకునేవాళ్లే లేకుండాపోయారు. కుక్కర్ లో వండేస్తున్నవాళ్లే ఎక్కువయ్యారు. అసలు గంజి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి బదులు ఈ గింజి తాగితే మనలో జరిగే మార్పులేంటో చూద్దాం…

 

25

 

గంజి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. అయితే.. ఉదయం చేసిన గంజి ఉదయాన్నే తాగడం కాకుండా.. రాత్రిపూట వండిన అన్నం నుంచి వార్చిన గంజిని.. ఉదయాన్నే తాళింపు పెట్టుకొని తాగితే మరింత రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందట.

 

నిజం చెప్పాలంటే, మనమందరం పండగళ వేళ మన రెగ్యులర్ డైట్ ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనకు నచ్చిన అన్ని స్వీట్లు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తినేస్తాం. దానివల్ల తెలీకుండానే బరువు పెరిగిపోతాం. ఆ పెరిగిన బరువును గంజి తాగడం వల్ల తగ్గించవచ్చు. ఉదయంపూట రెగ్యులర్ గా గంజి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిపోతాయి. మంచి డీటాక్స్ డ్రింక్ లా పని చేస్తుంది. ఫలితంగా పెరిగిన అధిక బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు.

 

35

 

ఈ అన్నం గంజిని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. కాబట్టి, ఇది పేగులకు ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనకరమైన ప్రోబయోటిక్ లను కలిగి ఉంటుంది. క్రమంగా మీ శరీరాన్ని తిరిగి సాధారణ స్థితి తీసుకురావడానికి  సహాయపడుతుంది. మీరు ఈ గంజి రుచిని మెరుగుపరచడానికి, మీరు దీనికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకులను జోడించవచ్చు, ఇది ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది.

 

45

 

మరి ఈ కంజిని ఎలా తయారు చేయాలి..? దీనిని ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

55
rice water

rice water

 

అన్నం ఉడికించే సమయంలోనే గంజిని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ గంజిలో ఉప్పు వేసి.. దానిపై ఏదైనా క్లాత్ కప్పి అలానే ఉంచాలి. గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 8 నుంచి 12 గంటలు అలానే ఉంచాలి. రాత్రంతా అలానే ఉంచేసి.. ఉదయాన్నే ఆ గంజికి తాళింపు కూడా జోడించి ఆ తర్వాత తాగేయడమే. రోజూ ఉదయాన్నే ఈ గంజి తాగడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్య అనేది లేకుండా పోతుంది.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Fluffy Puri: పూరీలు పొంగాలంటే ఈ మ్యాజిక్ మంత్ర మిస్ అవ్వొద్దు
Recommended image2
Masala Vada Recipe: ఈ చిన్న సీక్రెట్ తో పర్ఫెక్ట్ మసాలా వడ
Recommended image3
Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? మీకోసమే కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved