MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • డీప్ ఫ్రై కి ఏ నూనె వాడుతున్నారు..? ఈ పొరపాట్లు చేయకండి..!

డీప్ ఫ్రై కి ఏ నూనె వాడుతున్నారు..? ఈ పొరపాట్లు చేయకండి..!

అలా హై ఫ్లేమ్ మీద అలా కుక్ చేయకూడదట. కేవలం 325 నుంచి 390 డిగ్రీల ఫారన్ హీట్ దగ్గర మాత్రమే ఆయిల్ ని హీట్ చేయాలి. అప్పుడు మనకు మంచి ఫలితం దక్కుతుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 26 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
deep frying

deep frying

మనం రోజూ చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాం. వాటిలో డీప్ ఫ్రైడ్ వంటలు కూడా ఉంటాయి. పూరీలు, గారెలు, బోండా, పునుగులు లాంటి రోజువారి చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లు కూడా డీప్ ఫ్రై చేయాల్సినవే. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా తినకుండా ఉండలేం కాబట్టి  తింటూనే ఉంటాం. అయితే... వీటిని కుక్ చేసే సమయంలో చాలా మంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి.. ఏ పొరపాట్లు చేయకూడదో ఓసారి తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1.చాలా మంది డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ మీద పెడతారు. అలా పెట్టడం వల్ల  ఆయిల్ త్వరగా కాగుతుంది అనుకుంటారు. ఫుడ్ కూడా త్వరగా వేగుతుందని అనుకుంటారు. ఒక్కోసారి అలా చేయడం వల్ల మొత్తంగా మాడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.  కానీ అలా హై ఫ్లేమ్ మీద అలా కుక్ చేయకూడదట. కేవలం 325 నుంచి 390 డిగ్రీల ఫారన్ హీట్ దగ్గర మాత్రమే ఆయిల్ ని హీట్ చేయాలి. అప్పుడు మనకు మంచి ఫలితం దక్కుతుంది.
 

38

2.ఇక.. డీప్ ఫ్రైకి ఎలాంటి ఆయిల్ వాడాలి..? సీజనింగ్ ఎలాంటి నూనె వాడాలి అనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. ఆరోగ్యానికి మంచిది కదా అని  ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ కూడా  డీప్ ఫ్రైకి వాడతారు. కానీ... వీటి స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువ. కాబట్టి. ఈ నూనెలను పొరపాటున కూడా డీప్ ఫ్రైకి వాడకూడదు.వెజిటేబుల్ ఆయిల్, పీనట్ ఆయిల్ లాంటి వాటిని మాత్రమే డీప్ ఫ్రైకి వాడాలి.

48

3.ఇక.. డీప్ ఫ్రై చేసే సమసయంలో వాడే ప్యాన్ కూడా చాలా కీలకం. చాలా మంది ఏది పడితే అది ప్యాన్ వాడుతూ ఉంటారు. కానీ.. డీప్ ఫ్రై కి.. లోతుగా ఉండే ఫ్యాన్ ని ఎంచుకోవాలి. లోతుగా ఉండే ప్యాన్.. అది కూడా మందంగా ఉండే ప్యాన్ ఎంచుకోవడం ముఖ్యం. అలా ఉన్నవి ఎంచుకుంటేనే.. మంచిగా ఫ్రై అవుతాయి.

58
<p>deep fry cooking</p>

<p>deep fry cooking</p>

4.ఇక కొందరు హై టెంపరేచర్ లో ఆయిల్ హీట్ చేయకూడదు అన్నారు కదా అని.. లో టెంపరేచర్ మీద ఆయిల్ ని హీట్ చేస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదట. దాని వల్ల మీరు చేసే వంట పాడైపోతుంది. కాబట్టి.. మీరు నిజంగా ఇంట్లో డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే.. ఆయిల్ హీట్ చెక్ చేసే థర్మామీటర్ తెచ్చుకోవడం ఉత్తమం. దాని వల్ల  మీకు సరిగ్గా ఏ టెంపరేచర్ కి హీట్ చేయాలో తెలుస్తుంది.

68


5.ఇక చాలా మంది డీప్ ఫ్రై చేసే సమయంలో.. ఒకేసారి ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల.. ప్యాన్ ఇరుకుగా మారడం లేదంటే.. ఫుడ్స్.. మరీ ఎక్కువగా క్రంచీగా మారడం లాంటివి జరుగుతాయి. కాబట్టి.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్యాన్ లో పట్టినంత వరకే వేయడం ఉత్తమం. 

78

6.ఇక... చాలా మంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ ని మళ్లీ మళ్లీ వాడుతూనే ఉంటారు. కానీ.. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ని మళ్లీ మళ్లీ  వాడకపోవడమే ఉత్తమం. దీని వల్ల.. తర్వాత చేసే వంటలు పాడవ్వడమే కాకుండా... అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

88

7. ఇక డీప్ ఫ్రైకి వాడే పదార్థాలకు బ్యాటర్ కూడా మంచిగా కలపాలి. అంటే పకోడీ నే అనుకుందాం. క్వాంటిటీ సరిగా తీసుకోకపోపోతే.. సరైన రుచిని అందించవు. ఉప్పు ని ఎప్పుడు వేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. లేదంటే.. ఫుడ్ మొత్తం రుచి మారిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved