చికెన్, చేపలు.. రెండింటిలో ఏది మంచిదంటే?
కొంతమంది చికెన్ ను ఇష్టంగా తింటే మరికొంతమంది చేపలను ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?
చికెన్ vs చేప
చాలా మందికి శాఖాహారం కంటే మాంసాహారమంటేనే ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా ఆదివారాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చికెనో, మటనో వండుతుంటారు.
మాంసాహారాల్లో చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్డు, రొయ్యలు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే వీటిలో చాలా మంది చికెన్, చేపలను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చికెన్ vs చేప
చికెన్ ప్రయోజనాలు:
ప్రోటీన్లకు మంచి వనరు చికెన్. దీన్ని తింటే శరీర పెరుగుదల బాగుంటుంది. అలాగే ఎనర్జిటిక్ గా ఉంటారు. అయినా కానీ చికెన్ ను ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ ను ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు దీనికి బదులుగా నాటుకోడిని తినొచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మటన్ కంటె చికెనే మంచిది. ఇది డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కోడి మాంసంలో విటమిన్ బి3 బాగా ఉంటుంది. అలాగే జింక్, సెలీనియం, ఐరన్ లు కూడా మెండుగా ఉంటాయి.
చికెన్ vs చేప
చేపలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా సీ ఫుడ్ చాలా పోషకమైంది. దీనిలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కండరాలను బలంగా ఉంచే ప్రోటీన్, కళ్లు బాగా కనిపించడానికి అవసరమైన0 విటమిన్ ఎ కూడా మెండుగా ఉంటాయి. వారానికి రెండు సార్లు సీ ఫుడ్ ను తింటే మీ శరీరం మంచి హెల్తీగా ఉంటుంది.
మీకు తెలుసా? సముద్ర చేపలు తింటే మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది.అలాగే కళ్లు బాగా కనిపిస్తాయి. సముద్రపు ఆహారాలు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే చేపలను తింటే ఎముకల అరుగుదల కూడా తగ్గుతుంది. అలాగే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది.
చికెన్ vs చేప
చేప- చికెన్.. ఏది బెస్ట్?
చికెన్, చేప రెండింటిలో వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఈ రెండూ మన శరీరానికి మంచివే. అందుకే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పడం కష్టం. అయితే చికెన్‌లో ఐరన్, జింక్, సెలీనియం లు మెండుగా ఉంటాయి.
చేపలో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా-3 ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేప రెండూ ప్రోటీన్లకు మంచి వనరులు. అందుకే మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో ఆ ఆహారాన్ని ఎంచుకుని బాగా తినండి. కానీ తరచుగా మాత్రం తినకూడదు..