వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? తింటే ఏమౌతుంది..?
ఈ సీజన్ లో ఆకుకూరలు తినకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ.. ఈ సీజన్ లో ఆకుకూరలు తింటే ఏమౌతుంది..? ఏవైనా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...
వర్షాకాలం మొదలైంది. కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ లో... వైరస్ లు, బ్యాక్టీరియాలు చుట్టుముడుతూ ఉంటాయి. అందుకే.. ఈ కాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువ సమస్యలు ఆహారం కారణంగానే వస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అందుకే.. ఈ వర్షాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు.. ఈ సీజన్ లో ఆకుకూరలు తినకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ.. ఈ సీజన్ లో ఆకుకూరలు తింటే ఏమౌతుంది..? ఏవైనా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...
చాలా పరిశోధనల ప్రకారం తేలిన విషయం ఏమిటంటే... గాలిలో పెరిగిన తేమ.. ఆకుకూరల్లో అధిక తేమను శోషించడానికి కారణం అవుతుంది. ఆ తేమను బ్యాక్టీరియా ఆకర్షిస్తుంది. అక్కడ తమ సంతానాన్ని ఏర్పరుచుకుంటూ ఉండటం మొదలుపెడుతాయి.
leafy vegetables
వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ , అనేక ఇతర ప్రేగు సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు వర్షాకాలంలో ఆకు కూరలను తినవచ్చు,కానీ.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో చూద్దాం..
green leafy vegetables
1. తాజా ఆకులను వేరు చేయండి.... మీరు మీకు నచ్చిన ఆకు కూరలను కొనుగోలు చేసిన తర్వాత, తడిగా, నిస్తేజంగా ఉన్న వాటి నుండి శుభ్రంగా , ఆరోగ్యంగా కనిపించే ఆకులను వేరు చేయాలి.. అప్పుడు శుభ్రమైన ఆకుల ను మాత్రమే నిల్వ చేసుకోవాలి.
2. వాటిని సరిగ్గా కడగడం.. చాలా మంది వ్యక్తులు తమ ఆకుకూరలను కడగడానికి దుకాణంలో కొనుగోలు చేసిన క్లీనింగ్ సొల్యూషన్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ.. మీరు కృత్రిమ క్లీనర్‌లను ఉపయోగించకూడదని ఎంచుకోవచ్చు. బదులుగా, ఆకు కూరలను ఫ్లో అవుతన్న నీటిలో కడగాలి. ప్రతి ఆకుతో సమయాన్ని వెచ్చించండి. వాటిని విడిగా కడగాలని నిర్ధారించుకోండి.
3. ఆకులను ఆరబెట్టండి.. కడిగిన తర్వాత, అదనపు నీటిని వడకట్టండి. ఆకులను ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఆకు కూరలను ఎండబెట్టడానికి మీరు సలాడ్ స్పిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేదా, మీకు సలాడ్ స్పిన్నర్ లేకపోతే, కూరగాయలను కిచెన్ టవల్‌తో ఆరబెట్టండి. ఉపయోగం ఈ ఆకుకూరలను భవిష్యత్తు కోసం ఉపయోగించవచ్చు లేదా వెంటనే వాటిని ఉపయోగించవచ్చు.
4.అవసరం అయితే.. వేడి నీటిలో కూడా ఆకులను శుభ్రం చేయవచ్చు. వేడి నీటి నుండి ఆకు కూరలను తీసివేసిన వెంటనే, వాటిని మంచు నీటితో నింపిన గిన్నెలోకి మార్చండి. ఒక నిమిషం అలాగే ఉంచి దాన్ని తీసివేయండి. ఇలా శుభ్రం చేసిన తర్వాత.. మనం వంట చేసుకోవచ్చు.