MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమౌతుందో తెలుసా?

కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమౌతుందో తెలుసా?

మనం చేసే ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూరలను టేస్టీగా చేస్తుంది. కానీ వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేస్తే ఏం జరుగుతుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 19 2024, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ginger garlic

ginger garlic

ఇంటి నుంచి చిన్నా, పెద్ద రెస్టారెంట్ల వరకు.. చాలా రకాల ఆహారాల్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను ఖచ్చితంగా వేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫుడ్ రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. చాలా మంది అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను వేసిన దాకా వంట చేయనే చేరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ginger garlic

ginger garlic

టేస్ట్ కోసం వాడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అల్లం, వెల్లుల్లి రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి.

అల్లం దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి బరువును తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36
ginger garlic

ginger garlic

ఆరోగ్యానికి మేలు 

అల్లం, వెల్లుల్లి పేస్టును మనం ప్రతి కూరలో వేస్తాం. అలాగే బిర్యానీలో కూడా ఖచ్చితంగా వాడుతాం. ఈ ఈ పేస్ట్ ఆహారాన్ని మరింత టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 

మెరుగైన జీర్ణక్రియ

అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ జీర్ణశయాంతర సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణసమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

46
ginger garlic

ginger garlic

స్త్రీలకు మేలు

అల్లం, వెల్లుల్లి పేస్టును మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆడవాళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవును ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవడం వల్ల ఆడవారికి తలనొప్పి, నెలసరి తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మన శరీర రోగనిరోధక శక్తి ఎంత తక్కువగా ఉంటే మీకు అన్ని ఎక్కువ రోగాలు వస్తాయి. అయితే రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. అల్లం, వెల్లుల్లి పేస్టును ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని మీ శరీరానికి అందిస్తుంది. 
 

56
ginger garlic

ginger garlic

అంటువ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ

అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు కొంతమందికి ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇవి అంత తొందరగా తగ్గవు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పేస్ట్ లో ఉండే లక్షణాలు మీకు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. 

బరువు తగ్గడానికి

అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దీన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. ఈ పేస్ట్ ను తీసుకుంటే కేలరీలు  కరుగుతాయి. అలాగే ఆకలి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

66
ginger garlic

ginger garlic

గుండెకు మేలు 

ఈ రోజుల్లో పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved