MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • కాఫీలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే బరువు తగ్గుతారా..?

కాఫీలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే బరువు తగ్గుతారా..?

 కాఫీలో దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి  తాగితే.. నిజంగా బరువు తగ్గుతారా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 17 2024, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Cinnamon coffee

Cinnamon coffee

 

బరువు తగ్గడానికి  మన దగ్గర చాలా ఫార్ములాలు ఉన్నాయి. ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్ లు తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. అయితే.. కాఫీ తాగినా కూడా  ఈజీగా బరువు తగ్గుతారని అయితే.. అందులో దాల్చిన చెక్క పొడి వేస్తే చాలు అని కొందరు చెబుతున్నారు. దీనిని ఈ మధ్యకాలంలో చాలా మంది నమ్ముతున్నారు. మరి, దీనిలో నిజం ఎంత..? కాఫీలో దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి  తాగితే.. నిజంగా బరువు తగ్గుతారా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
cinnamon tea

cinnamon tea

 

మనలో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే.. రుచికరమైన కాఫీలో దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల… అది శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కూడా కరిగించగలదు అని చాలా మంది నమ్ముతున్నారు. దాల్చిన చెక్క పొడి ఫ్యాట్ ని కరిగిస్తుందా? పరిశోధనల ప్రకారం..  మన శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని ఈ దాల్చిన చెక్క కరిగిస్తుందా  లేదా అనేది.. మన బాడీలో ఉన్న ఫ్యాట్ మీద ఆధారపడి ఉంటుందట.   

 

35

 

రోజుకు 1.5 గ్రాముల కంటే తక్కువ దాల్చిన చెక్క మోతాదులను (సుమారు అర టీస్పూన్) తీసుకుంటే నడుము చుట్టుకొలత 1.68సెం.మీ తగ్గిందని ఓ పరిశోధనలో తేలిందట.  అలా అని.. రోజుకు 1.5g కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ చూపించదట. 




 

దాల్చిన చెక్కను సాధారణంగా వంట, ఆహారంలో మసాలాగా ఉపయోగించినప్పుడు సురక్షితమైనదిగా పరిగణిస్తారు. అయితే, అందరికీ దాల్చిన చెక్క ఆరోగ్యానికి సెట్ అవ్వదు.

కొందరు వ్యక్తులు దాల్చినచెక్క నుండి జీర్ణశయాంతర నొప్పి, అలెర్జీ ప్రతిచర్యలతో సహా దుష్ప్రభావాలను కలిగి ఉంటారు. క్రియాశీల పదార్ధాలలో ఒకటైన కౌమరిన్, కొంతమంది కాలేయాలకు విషపూరితం కావచ్చు. అందుకే.. అందరూ బరువు తగ్గడానికి దాల్చిన చెక్కను ఎంచుకోకూడదు.

 

45

 

కాఫీ, కోకో గురించి ఏమిటి?

బరువు తగ్గడానికి కాఫీ కూడా సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే దీనిని సమర్ధించటానికి ఇంకా మంచి ఆధారాలు లేవు. బరువు తగ్గే అవకాశం అయితే ఉంది కానీ… చాలా తక్కువ మాత్రమే తగ్గగలరు. అలాంటి కాఫీలో దాల్చిన చెక్క పొడి కూడా కలపడం వల్ల బరువు తగ్గే అవకాశాలు మరింత తక్కువ అని చెప్పొచ్చు.

 

 

55

కాఫీ నార్మల్ గా తాగినా.. దాల్చిన చెక్క పొడి కలిపి తాగినా కూడా.. ఈజీగా బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒకవేళ ఇవి తాగి, బరువు తగ్గాలి అంటే… ముందు లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మాత్రమే.. ఈజీగా బరువు తగ్గుతారట. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Recommended image2
Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు
Recommended image3
Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved