ప్రశాంతమైన నిద్రకోసం రాత్రిపూట తినాల్సిన, తినకూడని ఆహారాలు ఇవే..!
చాలా మందిని వేధిస్తున్నసమస్య నిద్రలేమి. ఈ నిద్రలేమిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అయితే రాత్రిళ్లు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండి.. కొన్ని ఆహారాలను తింటే ప్రశాంతంగా నిద్రపడుతుందంటున్నారు నిపుణులు.
మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే కంటినిండా నిద్రపోవాలి. అయితే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే మన శరీరం, మనస్సు రెండింటిపై చెడు ప్రభావం పడుతుంది. రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే అలసట, చిరాకు, పగటి నిద్ర, రోగనిరోధక శక్తి బలహీనపడటం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే నిద్రపట్టకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒత్తిడి, యాంగ్జైటీ వంటి కారణాల వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు. మీ ఆహారంలోని కొన్ని పోషకాలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు తెలిపారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి ఎలాంటి వాటిని తినాలి? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పడు తెలుసుకుందాం..
రాత్రి పూట తీసుకోవాల్సిన ఆహారాలు
గోరువెచ్చని పాలు
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగడం మంచిది. ఎందుకే ఈ పాలు మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి. పాలలో ఉండే క్యాల్షియం తొందరగా నిద్రపట్టేలా చేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ట్రిప్టోఫాన్ ను మెదడుకు తీసుకువెళుతుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు నిద్రపట్టేలా చేస్తుంది.
బాదం
శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గినప్పుడు నిద్రలేమి సమస్య వస్తుంది. అయితే బాదం పలుకులు మెగ్నీషియానికి మంచి మూలం. బాదంలో ఉండే మెగ్నీషియం మెలటోనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, ఇది నిద్రకు సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. వీటిని తింటే రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. ఈ గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మీరు గాఢంగా నిద్రపోతారు.
అరటిపండ్లు
రాత్రిపూట అరటిపండ్లను తినడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. నిద్రపట్టేలా చేస్తాయి. ఇది మెదడులో వేడి స్థాయిని తక్కువగా ఉంచడానికి, హార్మోన్లను నియంత్రించడానికి సహాయపడుతుంది.
రాత్రిపూట తినకూడని ఆహారాలు
స్పైసీఫుడ్: రాత్రిపూట స్పైసీ ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి నిద్రరాకుండా చేస్తాయి. రాత్రిపూట స్పైసీ ఫుడ్స్ ను తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.
వైట్ బ్రెడ్: రాత్రిపూట వైట్ బ్రెడ్ ను తినడం వల్ల మీ బరువు పెరగడంతో పాటుగా బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇది నిద్రమీకు నిద్ర రాకుండా చేస్తుందిి.
ఐస్ క్రీం: రాత్రిపూట ఐస్క్రీమ్ కు దూరంగా ఉండటం వల్ల మంచి నిద్రపడుతుంది. ఎందుకంటే వీటిలో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీర బరువును పెంచుతుంది.
ఫ్రైడ్ ఫుడ్: రాత్రిపూట నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల మీరు కంటినిండా నిద్రపోతారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఇలాంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.