MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • వావ్.. స్వీట్ పొటాటోను తింటే ఈ రోగాలేమీ రావా?

వావ్.. స్వీట్ పొటాటోను తింటే ఈ రోగాలేమీ రావా?

చిలగడదుంప మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది డయాబెటిస్ నుంచి గుండె జబ్బుల వరకు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది. అసలు దీన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 24 2023, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చిలగడదుంపలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపలో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. చిలగడదుంపలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

గుండె జబ్బుల నివారణ

చిలగడదుంపలో ఫైబర్, పొటాషియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఫైబర్ మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో ఆటోమెటిక్ గా మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ శరీరం నుంచి ధమనులలో నిల్వ చేసిన విషాన్ని కాలేయానికి తీసుకువెళుతుంది. అక్కడ నుంచి అవి శరీరం నుంచి ఫిల్టర్ చేయబడతాయి.

35
Sweet Potato

Sweet Potato

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

చిలగడదుంపలలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు చాలా అవసరం. దీన్ని తినడం వల్ల పేగుల్లో ఆహారం సులభంగా కదులుతుంది. పోషకాల శోషణ కూడా సులభతరం అవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. 

45

బరువు తగ్గడానికి 

చిలగడదుంపలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి తెలుసా. వీటిలో ఉండే ఫైబర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీనిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీరు బరువు తగ్గే ప్రయాణం సులువు అవుతుంది. చిలగడదుంపల్లో ఉండే ఫైబర్  నెమ్మదిగా జీర్ణమవుతుంది. అలాగే మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల మీరు అతిగా తినలేరు. అలాగే బరువు పెరిగే సమస్యను కూడా తగ్గిస్తుంది.

55

రక్తపోటు అదుపులో

చిలగడదుంపలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నిర్వహించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెజబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే ఈ తీపి బంగాళాదుంపలను మీ ఆహారంలో చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?
Recommended image2
Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది
Recommended image3
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved