కొబ్బరిని ఇలా తింటే.. ఫాస్ట్ గా బరువు తగ్గుతారు
కొబ్బరిని మనం ఎన్నోరకాల వంట్లో వేస్తుంటాం. ఎందుకంటే ఇది వంటలను చాలా రుచిగా చేస్తుంది. కానీ కొబ్బరిని మీరు బరువు తగ్గడానికి కూడా తినొచ్చు. ఇది మీ బరువును ఫాస్ట్ గా తగ్గిస్తుంది.
.
గుడికి వెళ్లినప్పుడు, ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు.. ఖచ్చితంగా కొబ్బరిని తింటుంటాం. అలాగే దీన్ని చాలా రకాల వంటల ద్వారా కూడా తింటుంటాం. అలాగే కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు ఇలా కొబ్బరిని ఎన్నో రకాలుగా తింటుంటాం. నిజానికి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని ఎన్నో వంటల్లో వేస్తుంటారు. కానీ కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అవును కొబ్బరిని తింటూ కూడా మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. దీన్ని తింటే జీవక్రియ పెరుగుతుంది. అలాగే శరీరంలోని అదనపు కేలరీలు కూడా కరిగిపోతాయి. దీంతో మీరు వెయిట్ లాస్ అవ్వడం సులువు అవుతుంది. అసలు కొబ్బరి మీరు బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Coconut
మెటబాలిజం పెరుగుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరి మన మెటబాలిజాన్ని పెంచుతుంది. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. దీంతో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. అలాగే మీరు బరువు కూడా తగ్గుతారు.
జీర్ణ ఆరోగ్యానికి మేలు
కొబ్బరిని తింటే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరిలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. కొబ్బరిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీకు అనవసరంగా ఏదీ తినాలనిపించదు. ఇది మీరు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించి, మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు
సాధారణంగా కొవ్వు మన బరువును మరింత పెంచుతుందని అనుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు మీ బరువును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనె లేదా కొబ్బరి గుజ్జులో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వులు. వీటిని మీ శరీరం ఫాస్ట్ గా గ్రహించి కొవ్వుగా నిల్వ చేయడానికి బదులుగా శక్తిగా వినియోగిస్తుంది. అలాగే ఈ మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తాయి. అలాగే జంక్ ఫుడ్ తినకుండా చేస్తాయి.
coconut
హార్మోన్ల ఆరోగ్యానికి మద్దతు
కొబ్బరిని తింటే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. నిజానికి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్లను తయారు చేయడానికి సహాయపడతాయి. అలాగే వాటిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటే బరువు తగ్గుతారు. అలాగే బరువు పెరగకుండా ఉంటారు.