MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • పాలల్లో ఖర్జూరం నానపెట్టి తింటే ఏమౌతుంది..?

పాలల్లో ఖర్జూరం నానపెట్టి తింటే ఏమౌతుంది..?

ఎవరైనా తాము ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా బరువు పెరగడం లేదని బాధపడుతుంటే.. వాళ్లకు ఈ ఖర్జూరం, పాలు బెస్ట్ ఆప్షన్.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 28 2024, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
dates shake

dates shake

 

పాలు ఆరోగ్యానికి మంచిది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పాలను తమ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఇదే పాలల్లో ఖర్జూరాలను కూడా కలిపి తీసుకుంటే ఏమౌతుంది..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 

ప్రతిరోజూ రెండు లేదంటే మూడు ఖర్జూరాలను పాలల్లో నానపెట్టి తీసుకోవాలట. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా ఎముకలు బలంగా మారతాయి. ఈ రోజుల్లో  వయసుతో సంబంధం లేకుండా  చాలా మంది కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు.. పాలల్లో ఖర్జూరాలను నానపెట్టి తీసుకోవాలట.  ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.జాయింట్ పెయిన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

 

35

 

ఎవరైనా తాము ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా బరువు పెరగడం లేదని బాధపడుతుంటే.. వాళ్లకు ఈ ఖర్జూరం, పాలు బెస్ట్ ఆప్షన్. రోజుకి 4 లేదంటే 5 ఖర్జూరాలను పాలల్లో నానపెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల.. వారు సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగే బరువు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

ఖర్జూరాలను పాల్లలో నానపెట్టి తినడం వల్ల…. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల… తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది.

 

45
Benefits of Dates

Benefits of Dates

 

కొందరికి ఆహారం తీసుకున్నా కూడా చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.అలాంటివారు ఈ పాలు, ఖర్జూరం కాంబినేషన్ తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. ఫలితంగా నీరసం లాంటివి ఉండవు.

 

మలబద్దకం సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది.అలాంటివారుు ఈ పాలల్లో నానపెట్టిన ఖర్జూరం తినడం వల్ల.. మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాదు.. రక్తహీనత సమస్య కూడా ఉండదు.  శరీరంలో రక్తం తక్కువై చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. అలాంటివారు పాలల్లో ఖర్జూరం నానపెట్టి తినాలి. అప్పుడు రక్తం శాతం పెరుగుతుంది.

 

55

 

ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలను తీర్చడమే కాదు.. అందాన్ని పెంచడంలోనూ సహాయపడతుతుంది. చర్మాన్ని అందంగా మార్చడం దగ్గరి నుంచి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved