పరిగడుపున బాదం పప్పులను తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే?
బాదం పప్పుల్లో మన ఆరోగ్యానికి సహాయపడే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
బాదం పప్పులను ఉదయం పరిగడుపున తినడం వల్ల మనం లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. బాదంలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. అసలు బాదం పప్పులను ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Image: Freepik
యాంటీ ఆక్సిడెంట్లు
బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. అవి మమన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి. వీటిని పరిగడుపున తిన్నప్పుడు ఈ యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని హానికరమైన పదార్థాలను తటస్తం చేస్తాయి. అలాగే మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
Soaked Almonds
ఆరోగ్యకరమైన కొవ్వులు
బాదం పప్పుల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వీటిలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవిశరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. పరిగడుపున బాదం పప్పులను తింటే ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తంలో లభిస్తాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి.
విటమిన్ ఇ
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఆహారాల్లో బాదం ఒకటి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ చర్మాన్ని, జుట్టును, గోర్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో బాదం పప్పులను తినడం వల్ల మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అలాగే మీ చర్మం సహజంగా మెరుస్తుంది.
బెస్ట్ ఎనర్జీ
ఉదయాన్నే మీకు వెంటనే ఎనర్జీ కావాలంటే పరిగడుపున గుప్పెడు బాదం పప్పులను తినండి. ఇవి మీకు రోజంతా స్థిరమైన ఎనర్జీని అందిస్తాయి. బాదం పప్పుల్లోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలయిక మీకు మంచి శక్తిని అందిస్తాయి. ఇవి ఆహార కోరికలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
బరువు తగ్గడానికి..
పరిగడుపున బాదం పప్పులను తినడం వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు. బాదంలోని ఫైబర్, ప్రోటీన్ మీ కడుపును నిండిన భావనను కలిగిస్తాయి. అలాగే ఆకలిని తగ్గిస్తాయి. ఎక్కువ సేపు మీ కడుపును నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది చివరికి మీరు కేలరీల తీసుకోవడాన్ని తగ్గించి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.