MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • గుండె జబ్బులు రావొద్దంటే వీటిని తినాల్సిందే..!

గుండె జబ్బులు రావొద్దంటే వీటిని తినాల్సిందే..!

చెడు  ఆహారాలు, నిశ్చల జీవనశైలి, స్మోకింగ్, ఊబకాయం, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 25 2023, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
heart health

heart health

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన జీవన శైలిని మెరుగ్గా ఉంచుకుని కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image: FreePik

Image: FreePik

బంగాళాదుంపలు

బంగాళాదుంపలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడతాయి. ఆలుగడ్డల్లో పొటాషియం,ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఆలుగడ్డలను తింటే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఆలుగడ్డలను మరీ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగిపోతారు. 
 

37

ఆరెంజ్

విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఆరెంజ్ లు కూడా గుండెజబ్బులను అడ్డుకుంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. 
 

47
olive oil

olive oil

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. 
 

57

బచ్చిలికూర

బచ్చలి కూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ కూరలో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే బచ్చలికూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 

67

ఆపిల్

రోజుకు ఒక ఆపిల్ పండును తినడం వల్ల డాక్టర్ ను దూరంగా ఉండొచ్చు అన్న మాట అందరికీ తెలిసిందే. ఆపిల్  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న పండు. యాపిల్స్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ కె  వంటి పోషకాలు ఉంటాయి. ఈ పండు గుండె పనితీరును మెరుగ్గా ఉంచుతుంది

77

అవొకాడో

పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండే అవొకాడోలు అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి సహాయపడతాయి. వీటిని తింటే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved