బిర్యానీ మసాలా జాపత్రి తింటే ఏమౌతుందో తెలుసా?
రెగ్యులర్ గా జాపత్రిని నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బిర్యానీ ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే.. ఆ బిర్యానీకి ఆ రుచి దాంట్లో వేసే మసాలా కారణంగా వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మసాలాల్లో జాపత్రి కూడా ఒకటి. మరి… అంత రుచిని పంచే జాపత్రి మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుందని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..
మన వంటగదిలో చాలా రకాల మసాలాలు ఉంటాయి. వాటిని మనం వంటకు వాడుతూ ఉంటాం. కానీ ఆ మసాలాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మసాలా దినసులు మనకు అనేక రకాలుగా మేలు చేస్తాయి. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి, బరువు తగ్గిస్తాయి. నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. రుతు సమస్యలు కూడా తగ్గిస్తాయి. ఇలాంటి ప్రయోజనాలు అందించే వాటిలో బిర్యానీ మసాలా జాపత్రి ముందు వరసలో ఉంటుంది. మరి.. రెగ్యులర్ గా జాపత్రిని నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జాపత్రి నీటి ఆరోగ్య ప్రయోజనాలు…
జాపత్రిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి.. ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. మీరు మీ ఇంట్లో తరచుగా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే, మీరు జాపత్రి నీటిని తాగవచ్చు. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన టానిక్‌గా పనిచేస్తుంది.
జాపత్రి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తుంది. దీన్ని తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.
మీరు బరువు తగ్గాలనుకుంటే, ఖచ్చితంగా భోజనానికి ముందు ఈ నీటిని తీసుకోండి.
జాతిపత్రి నీళ్లలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఈ నీరు శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఒత్తిడి కంట్రోల్ లో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, పీరియడ్ పెయిన్స్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.