Chicken, Mutton: చికెన్, మటన్ లో ఈ 2 వేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు!
చాలామంది చికెన్, మటన్ ఇష్టంగా తింటారు. రోజూ నాన్ వెజ్ తినేవారు కూడా లేకపోలేదు. అయితే చికెన్, మటన్ మరింత టేస్టీగా ఉండాలంటే మాత్రం ఈ రెండు పదార్థాలు వేయాల్సిందే. ఇంతకీ అవెంటో తెలుసుకోండి మరి.

చికెన్, మటన్ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. చాలామంది నాన్ వెెజ్ ఇష్టంగా తింటారు. అయితే కూర రుచి అంతా గ్రేవీలోనే ఉంటుంది. గ్రేవీ చిక్కగా ఉంటేనే ముక్క టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ని మసాలాలు వేసినా చికెన్ గ్రేవీ చిక్కగా రావట్లేదని చాలామంది అంటుంటారు. కానీ హోటళ్లలో చికెన్ గ్రేవీ చూస్తే అది థిక్‌గా ఉంటుంది. మరి ఆ ట్రిక్ ఏంటో మీరు తెలుసుకోండి.
మసాలాలు ఎక్కువ వేస్తే?
చికెన్ గ్రేవీ తిక్కుగా ఉంటే చపాతీ లేదా రోటీకి మంచి కాంబినేషన్ అవుతుంది. కొంతమంది చికెన్ గ్రేవీ చేయడానికి ఎక్కువ మసాలాలు వేస్తారు. అలా చేయడం వల్ల వంటకం రుచే పాడవుతుంది. తినడానికి ఏం బాగుండదు.
2 పదార్థాలతో..
గ్రేవీ చిక్కగా కావాలంటే దానికోసం రెండు పదార్థాలు వాడాల్సి ఉంటుంది. ఈ రెండు పదార్థాలను సరిగ్గా వాడితే చికెన్ లేదా మటన్ వంటకం టేస్టీగా ఉంటుంది.
ఇలా చేస్తే చికెన్ సూపర్
ఉల్లిపాయలు, జీడిపప్పు వాడటం వల్ల చికెన్ లేదా మటన్ గ్రేవీ చిక్కగా మారుతుంది. అయితే ఈ రెండు పదార్థాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా వేయాలి?
కట్ చేసిన ఉల్లిపాయలను పాన్‌లో వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఉల్లిపాయలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. జీడిపప్పును నీటిలో అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.
జీడిపప్పుకు బదులు..
ఉల్లి, జీడిపప్పు పేస్ట్ వాడటం వల్ల మటన్ లేదా చికెన్ గ్రేవీ చిక్కగా అవుతుంది. కొంతమంది జీడిపప్పుకు బదులు తెల్ల నువ్వులు కూడా వాడతారు. పేస్ట్ చేయకుండా ఉల్లిపాయలు వేస్తే వంటకంలో తియ్యదనం ఎక్కువవుతుంది.