MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Flight Fuel: విమానంలో వాడే ఇంధనం ఏమిటి? ఆ ఇంధనం లీటర్ ధర ఎంత?

Flight Fuel: విమానంలో వాడే ఇంధనం ఏమిటి? ఆ ఇంధనం లీటర్ ధర ఎంత?

Flight Fuel: విమాన ప్రయాణం చేయాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. సామాన్యులు ప్రయాణం చేయలేరు. విమానం ధరలు ఎందుకంత ఎక్కువగా ఉంటాయో తెలుసా? దీనికి ప్రధాన కారణం విమానం ఎగిరేందుకు వాడే ఇంధనమే. ఆ ఇంధన లీటర్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 13 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విమానంలో వాడే ఇంధనం ఏమిటి?
Image Credit : BBC

విమానంలో వాడే ఇంధనం ఏమిటి?

విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ టిక్కెట్ ధరలు అధికంగా ఉండడం సామాన్యులు ప్రయాణం చేయలేరు. విమాన ధరలు అంత ఎక్కువగా ఉండడం వల్ల టిక్కెట్ ధర కూడా అధికంగానే ఉంటుంది.  ప్రతి విమానం టేకాఫ్ వెనుక వేల లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అవసరం పడుతుంది. 

ఇతర వాహనాల్లా విమానాల్లో వాడేది పెట్రోల్ లేదా డీజిల్‌ కావు. అది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అనే ప్రత్యేక ఇంధనం. ఇది అత్యంత శుద్ధి చేసిన ఇంధనం. ముడి చమురు నుంచి లభించే ఉప ఉత్పత్తులలో ఇదీ ఒకటి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే  విమాన ఇంధన ధరలు ఇంకా పెరిగిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లీటర్ ఇంధనం ధర ఎంత?
Image Credit : Asianet News

లీటర్ ఇంధనం ధర ఎంత?

మనదేశంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై జీఎస్టీ విధించరు. దానికి బదులుగా విలువ ఆధారిత పన్ను (VAT) విధిస్తారు. అందుకే ఈ ఇంధనం ధర నగరాన్ని బట్టి మారుతుంది. ఈ ఇంధనం ధర 1000 లీటర్లు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. ఈ ఇంధనాన్ని బీపీసీఎల్, హెచ్‌పీ, ఐఓసీ వంటి చమురు సంస్థలు పైపుల ద్వారా విమానయాన సంస్థలకు సరఫరా చేస్తాయి. చిన్న విమానాశ్రయాలకు ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్తారు. ఈ ఇంధనం ఎంత ప్రత్యేకమైనదంటే ఎక్కువ ఎత్తులో, తక్కువ ఉష్ణోగ్రతలో కూడా గడ్డకట్టదు. దీని డెన్సిటీ ఎక్కువ. ప్రయాణ సమయంలో అగ్ని ప్రమాదాలను కూడా ఇది నివారిస్తుంది.

Related Articles

Related image1
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాన్స్‌లో పుట్టకపోయినా ఆ పేరెందుకు వచ్చింది?
Related image2
Old Watch: మీ పాత వాచ్‌ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా?
33
ఎంత ఇంధనం విమానంలో వాడతారు?
Image Credit : Getty

ఎంత ఇంధనం విమానంలో వాడతారు?

మన దేశంలో బోయింగ్ 737 లేదా ఎయిర్‌బస్ ఏ320 వంటి మధ్య తరహా విమానాలు అధికంగా నడుస్తాయి. ఇది గంటకు సగటున 2500 నుంచి 3000 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.  విమానం గంట ప్రయాణించిందంటే సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. విమానం రెండు గంటల ప్రయాణిస్తే 5000 నుంచి 6500 లీటర్ల ఇంధనం అవసరం. ఈ రెండు గంటల ప్రయాణానికి ఇంధన ఖర్చు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు అవుతుంది. కొన్నిసార్లు అదనంగా 7000 లీటర్ల వరకు ఇంధనాన్ని రిజర్వ్‌లో ఉంచుతారు. అప్పుడు ఇంధన ఖర్చు మరింత పెరుగుతుంది. ఇంత ఖర్చును భరించాలంటే టిక్కెట్ రేట్లను అధికంగా పెట్టాలి. 

ఇతర దేశాలకు ప్రయాణించే బోయింగ్ 777 లేదా ఎయిర్‌బస్ ఏ380 వంటి భారీ విమానాలకు గంటకు సగటున 10,000 నుంచి 12,000 లీటర్ల ఇంధనం అవసరం పడుతుంది. దీనికి సుమారుగా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుంది. అంటే విమానం 2 గంటలు ప్రయాణిస్తేఇంధన ఖర్చు సుమారు రూ.24 లక్షలు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Recommended image2
కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?
Recommended image3
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Related Stories
Recommended image1
French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాన్స్‌లో పుట్టకపోయినా ఆ పేరెందుకు వచ్చింది?
Recommended image2
Old Watch: మీ పాత వాచ్‌ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved