MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు

Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు

Mushrooms : పుట్టగొడుగులు మార్కెట్‌లో కిలోల లెక్కన కొంటాం. మహా అయితే రూ.60-రూ.100 ఉంటుంది ఒక ప్యాకెట్. కానీ ఈ పుట్టగొడుగులకు మాత్రం రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. అసలెందుకు ఇంత కాస్ట్? వీటి స్పెషల్ ఏంటీ?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 12 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంత ధర ఎందుకు? వీటి ప్రత్యేకత ఏమిటి?
Image Credit : gemini ai

అంత ధర ఎందుకు? వీటి ప్రత్యేకత ఏమిటి?

మామూలుగా పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ మార్కెట్‌లో కిలోల లెక్కన కొంటాం. మహా అయితే రూ.60-రూ.100 ఉంటుంది ఒక ప్యాకెట్. కానీ ప్రపంచంలో కొన్ని రకాల పుట్టగొడుగుల ధరలు చూస్తే ఆశ్చర్యపోతారు. డబ్బున్నోళ్లు కూడా కొనలేరు. ఇక సామాన్యులేం కొంటారు. ఎందుకంటే కిలో వేల డాలర్ల ధర ఉంటుంది. ఒక్కోసారి వేలంలో లక్షల డాలర్లకు అమ్ముడయ్యే సందర్భాలు ఉన్నాయి. వీటికి అంత ధర ఎందుకు? ప్రత్యేకత ఏమిటి?

వైట్ ట్రఫుల్.. రూ.కోటికిపైగానా 

వైట్ ట్రఫుల్ (White Truffle). అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. ఇటలీ, క్రొయేషియా ప్రాంతాల్లో లభించే ఈ మష్రూమ్..ప్రత్యేకమైన వాసన, రుచి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాధారణ పుట్టగొడుగుల్లా కాకుండా, ఇవి నేలలో చెట్ల వేర్లకు దగ్గరగా పెరుగుతాయి. ఓక్, బీచ్ వంటి చెట్లతో కలిసి పెరిగే వీటిని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కల సహాయం తీసుకుంటారు. సాగు చేయడం కూడా చాలా కష్టం. అందుకే డిమాండ్ ఎక్కువ.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 2007 డిసెంబర్‌లో సుమారు 1.3 కిలోల బరువున్న ఒక భారీ వైట్ ట్రఫుల్‌ను మకావులో జరిగిన వేలంలో 3.3 లక్షల అమెరికన్ డాలర్లకు విక్రయించారు. భారత కరెన్సీలో కోట్ల రూపాయలకు సమానం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యార్ట్‌సా గున్‌బు.. కిలో కాదు, గ్రాము కూడా ఖరీదే.
Image Credit : gemini ai

యార్ట్‌సా గున్‌బు.. కిలో కాదు, గ్రాము కూడా ఖరీదే.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మష్రూమ్స్ లో యార్ట్‌సా గున్‌బు (Yartsa Gunbu) ఒకటి. దీనిని క్యాటర్‌పిల్లర్ ఫంగస్ అని కూడా పిలుస్తారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా టిబెట్ పీఠభూమి పరిసరాల్లో కనిపిస్తుంది. సాధారణ పుట్టగొడుగుల్లా నేలపై పెరగదు. ఒక రకమైన పరాన్నజీవి ఫంగస్ గొంగళి పురుగులపై పెరిగి, అక్కడ అవి కలవడం వల్ల వృద్ధి చెందుతుంది.

దీన్ని సేకరించడం కూడా కష్టమే. చాలా తక్కువగా దొరుకుతుంది. ఆసియా మార్కెట్లలో ఉన్న దీనికి డిమాండ్ కారణంగా భారీ ధర పలుకుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 2023లో దీని ధర పౌండ్‌కు 63,000 డాలర్ల వరకు చేరింది. అంటే సుమారు 450 గ్రాములకే అంత ధర అన్నమాట. ఇది మార్కెట్ రేటు కాదు... క్వాలిటీ, లభ్యత, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. సంప్రదాయ చైనీస్ వైద్యంలో దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

34
మాట్సుటాకే..
Image Credit : gemini ai

మాట్సుటాకే..

జపాన్‌లో మాట్సుటాకే (Matsutake) పుట్టగొడుగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ప్రధానంగా పైన్ చెట్ల వేర్ల దగ్గర పెరుగుతాయి. వీటి నుంచి వచ్చే ఘాటైన, పైన్ చెట్లను గుర్తుచేసే సువాసన, మాంసంలాంటి ఆకారంతో ఉంటాయి.

మాట్సుటాకే పుట్టగొడుగులు సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తాయి. వాతావరణంలో మార్పులు, అడవుల క్షీణత, సాగు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి. జపాన్‌లో స్థానికంగా లభించే అత్యుత్తమ నాణ్యత గల మాట్సుటాకే ధర కిలోకు సుమారు 1.5 లక్షల యెన్ వరకు చేరిన సందర్భాలున్నాయి. వీటిని ఎక్కువ మసాలాలు వేయకుండా గ్రిల్ చేసి తింటారు. సూప్‌లలో కలుపుతారు. అన్నంతో కలిపి వండుతారు.

44
బ్లాక్ ట్రఫుల్..
Image Credit : gemini ai

బ్లాక్ ట్రఫుల్..

బ్లాక్ ట్రఫుల్ (Black Truffle) కూడా ప్రపంచంలోని ఖరీదైన ఆహార పదార్థాల్లో ఒకటి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లోని పెరిగోర్డ్ ప్రాంతానికి చెందిన ట్రఫుల్స్‌కు మంచి గుర్తింపు ఉంది. వీటిని పాస్తా, రిసోట్టో, సాస్‌లు, ఇతర ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు.

ఇంత ధర పలకడానికి అసలు కారణాలేంటి?

ఈ పుట్టగొడుగుల పెరుగుదలకు అవసరమైన వాతావరణం, సీజన్, సేకరణలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే అంత రేటు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఫ్యాక్ట్ చెక్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అక్బర్ చక్రవర్తికి ఎన్ని వేల ఎకరాల భూమి ఉండేదో తెలుసా? ఇప్పుడు ఆ భూమి ఎవరి దగ్గర ఉంది?
Recommended image2
పేదరికం నుంచి పుట్టిన నీలిరంగు మాత్ర.. వయాగ్రా, దీన్ని మొదట గుండెనొప్పి కోసం కనిపెట్టారని తెలుసా?
Recommended image3
Dhruv Rathee’s Cars: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రాయల్ లైఫ్‌స్టైల్.. గ్యారేజ్‌లో ఉన్న టాప్ లగ్జరీ కార్లు ఇవే
Related Stories
Recommended image1
Aluminium Vs Stainless: రోజూ వంట చేయడానికి ఏ కుక్కర్ బెటర్? అల్యూమినియమా? స్టీలా?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved