MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Old Currency Notes Ban : ఇక పాత కరెన్సీ నోట్లు చెల్లవా? RBI ఏమంటోంది?

Old Currency Notes Ban : ఇక పాత కరెన్సీ నోట్లు చెల్లవా? RBI ఏమంటోంది?

పాత కరెన్సీ నోట్లపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నోట్ల రద్దు భయం జనంలో మొదలైంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 04 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 నిజంగానే పాత నోట్లు చెల్లవా?
Image Credit : Gemini AI

నిజంగానే పాత నోట్లు చెల్లవా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. 2005కు ముందు ప్రింట్ అయిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూలై 1 నుంచి చెల్లవని, వాటిని రద్దు చేశారని ఆ పోస్టు సారాంశం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోగోతో ఈ వార్త షేర్ అవ్వడంతో, చాలామంది ఇది నిజమేనని నమ్మి కంగారు పడ్డారు. ముఖ్యంగా వ్యాపారులు ఎక్కడ ఈ నోట్లు చెల్లవోనని కస్టమర్ల నుండి తీసుకోడానికి జంకుతున్నారు.. దీంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాతనోట్ల రద్దుపై పిఐబి క్లారిటీ
Image Credit : iSTOCK

పాతనోట్ల రద్దుపై పిఐబి క్లారిటీ

సోషల్ మీడియాలో జరుగుతున్న పాతనోట్ల రద్దు ప్రచారంలో ప్రభుత్వరంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త పూర్తిగా అబద్ధమని, దీనికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని తన ఫ్యాక్ట్ చెక్ పోస్టులో తేల్చి చెప్పింది. చిన్న విలువ కలిగిన ఈ నోట్లను రద్దు చేసే ఎలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ తీసుకోలేదని PIB స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు కంగారుపడాల్సిన అవసరం లేదు.  

Related Articles

Related image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Related image2
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
35
పాత నోట్ల రద్దుపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రియాక్ట్
Image Credit : Gemini AI

పాత నోట్ల రద్దుపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రియాక్ట్

ఇదే విషయంపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా స్పందించింది. తమ పేరుతో పాత నోట్ల రద్దు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఈ బ్యాంక్ ఉన్నతాధికారులు ఖండించారు. తమ బ్యాంకు పేరును ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని… కస్టమర్లు, ప్రజలు ఈ వదంతులను నమ్మవద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది. ఏదైనా అనుమానాలుంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి క్లారిటీ తీసుకోవాలని మహారాష్ట్ర బ్యాంక్ సూచిస్తోంది. 

45
పాత నోట్ల రద్దు ప్రచారంపై RBI ఏమంటోంది?
Image Credit : Getty

పాత నోట్ల రద్దు ప్రచారంపై RBI ఏమంటోంది?

ఇక భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా, ప్రజలను గందరగోళానికి గురిచేసేలా పాత నోట్ల రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వివరణ ఇచ్చింది. 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ప్రస్తుతం పూర్తి చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించడంపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. 

పాత మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను మార్చుకోవాలని గతంలో సూచించామని… మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్న కొత్త నోట్లను పొందాలని సలహా మాత్రమే ఇచ్చామంటోంది ఆర్బిఐ. ఇదే సోషల్ మీడియాలో పాత నోట్ల రద్దు ప్రచారానికి కారణం కావచ్చు. అయితే పాత నోట్లను రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేము…. అవి చెల్లుబాటులోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 

55
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
Image Credit : Getty

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

2016లో రూ.500, రూ.1,000 నోట్లను అకస్మాత్తుగా రద్దు చేసిన ఘటన ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా మెదులుతూనే ఉంది. అందుకే ఇలాంటి వార్తలు వేగంగా వ్యాపించి భయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి కరెన్సీ నోట్లు, బ్యాంకింగ్ సేవలు లేదా RBIకి సంబంధించిన ఏ సమాచారమైనా, సోషల్ మీడియా పోస్టులను గుడ్డిగా నమ్మొద్దు. RBI, PIB ఫ్యాక్ట్ చెక్ వంటి అధికారిక ప్రకటనలను చూసి నిర్ధారించుకున్న తర్వాతే నమ్మడం సురక్షితం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫ్యాక్ట్ చెక్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Temple Bells: ఈ ప్రముఖ దేవాలయాల్లో గంటలు ఎవరూ కొట్టకుండానే మోగుతాయి.. ఇదొక మిస్టరీ
Recommended image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Recommended image3
Facts : మిల్లీగ్రాముల గుండుసూది సైతం నీటిలో మునుగుతుంది.. లక్షల టన్నుల షిప్ ఎలా తేలుతుంది?
Related Stories
Recommended image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved