MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • కూర్చుని కాళ్లు ఊపితే దరిద్రం చుట్టుకుంటుందా? పెద్దలు చెప్పింది ఎంత వరకు నిజం?

కూర్చుని కాళ్లు ఊపితే దరిద్రం చుట్టుకుంటుందా? పెద్దలు చెప్పింది ఎంత వరకు నిజం?

చాలామందికి కూర్చుంటే కాళ్లు ఆగవు.. అలా కదిలిస్తూనే ఉంటారు. కాళ్లను అదే పనికా ఊపడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందా? ఇంటికి, ఒంటికి మంచిది కాదా? పెద్దలు చెప్పిన మాటలో నిజం ఎంత? డాక్టర్లు ఈ విషయంలో ఏమంటున్నారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కూర్చుని కాళ్లు ఊపడం మంచిది కాదా?
Image Credit : Asianet News

కూర్చుని కాళ్లు ఊపడం మంచిది కాదా?

మనలో చాలా మందికి కుర్చీలో కూర్చున్నప్పుడు లేదా ఎక్కడైనా ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మందిలో ఈ లక్షణం కనిపిస్తూనే ఉంటుంది. అయితే, “ఎలాంటి పనిలేకుండా అలా కాళ్లు ఊపడం మంచిది కాదు, దరిద్రం వస్తుంది లేదా ఆరోగ్యం పాడవుతుంది” అని మన పెద్దలు తరచూ వారిస్తుంటారు. మరి ఆ మాటల్లో నిజం ఎంత? ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారు? దాని వెనుక ఉన్న శాస్త్రీయ - ఆరోగ్య పరమైన కారణాలు ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కాళ్లు ఊపే అలవాటు వెనుక ఉన్న వైద్య కారణాలు ఏమిటి?
Image Credit : Asianet News

కాళ్లు ఊపే అలవాటు వెనుక ఉన్న వైద్య కారణాలు ఏమిటి?

వైద్య నిపుణులు ‌- డాక్టర్ల విశ్లేషణ ప్రకారం, మనం కుర్చున్నప్పుడు కాళ్లు నిరంతరం ఊపడం అనేది కేవలం ఒక సాధారణ అలవాటు మాత్రమే కాదు. ఇది మన శరీరంలో జరుగుతున్న కొన్ని శారీరక లేదా మానసిక మార్పులకు సంకేతం కావచ్చు. కూర్చుని కాళ్లు ఊపడం వల్ల రక్త ప్రసరణలో మార్పులు రావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. వైద్య పరిశోధనల ఆధారంగా

కాళ్లు ఊపడం వల్ల రక్త ప్రసరణకు ప్రయోజనమా? అంటే.. సాధారణంగా ఒకేచోట ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలో రక్త ప్రవాహం తగ్గవచ్చు.

ఇలాంటి సమయంలో పాదాలను కదిలించడం, మడమలను పైకి కిందికి ఆడించడం, కాళ్ల కండరాలను కదిలించడం వల్ల రక్త ప్రసరణ తాత్కాలికంగా పెరగవచ్చు.2016లో ప్రచురితమైన ఒక పరిశోధనలో 11 మంది ఆరోగ్యవంతులపై అధ్యయనం నిర్వహించారు. మూడు గంటలపాటు కూర్చున్న సమయంలో ఒక కాలును మధ్యమధ్యలో కదిలించగా, ఆ కాలులో రక్త ప్రవాహానికి సంబంధించిన సూచికలు మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది చిన్న అధ్యయనం మాత్రమే. కాళ్లు ఊపడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని దీని ఆధారంగా చెప్పలేం.

33
కేలరీలు ఖర్చవుతాయా?
Image Credit : Asianet News

కేలరీలు ఖర్చవుతాయా?

కాళ్లను కదిలించినప్పుడు కండరాలు కొంత శక్తిని వినియోగిస్తాయి. అందువల్ల పూర్తిగా కదలకుండా కూర్చోవడంతో పోలిస్తే శక్తి వినియోగం కొద్దిగా పెరగవచ్చు. అయితే కాళ్లు ఊపడం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, రోజువారీ శారీరక చురుకుదనం కూడా అవసరం.

ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదు

కాళ్లు ఊపుతున్నప్పటికీ గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. మధ్యమధ్యలో లేచి నిలబడటం, కొద్దిసేపు నడవడం, శరీరాన్ని సాగదీయడం మంచిది. ఇలా చేయడం వల్ల నిశ్చలంగా గడిపే సమయాన్ని తగ్గించవచ్చు. అయితే కాళ్లను కదిలించకుండా ఉండలేనంతగా అసౌకర్యం కలగడం, ముఖ్యంగా రాత్రిపూట కాళ్లలో ఇబ్బంది పెరగడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఇవి కొన్నిసార్లు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు.

కూర్చొని కాళ్లుఊపడంలో తప్పులేదు..

వెనకట చెప్పినట్టు కూర్చుని కాళ్లు ఊపడం దరిద్రం కాదు, అది ప్రతి సందర్భంలోనూ చెడు అలవాటు కాదు. కొంతవరకు కాళ్ల కండరాల కదలికకు, రక్త ప్రసరణకు ఈ అలవాటు తోడ్పడవచ్చు. కానీ దీనిని వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించి, క్రమం తప్పకుండా నడవడం, శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Apple: ఎరుపు, ఆకుపచ్చే కాదు నల్ల ఆపిల్స్ కూడా ఉన్నాయి.. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే
Recommended image2
విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి? ఇతర రంగుల్లో ఎందుకుండవు?
Recommended image3
Highest Paying Jobs: మనదేశంలో అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇవే.. డాక్టర్, ఇంజినీర్ మాత్రం కావు
Related Stories
Recommended image1
Warranty vs Guarantee: వారంటీ – గ్యారెంటీ మధ్య తేడా ఏంటి? వస్తువు కొన్నప్పుడు ఏది చూసుకోవాలి?
Recommended image2
Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved