MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ టైంలో కనిపించే WL, RAC, CNF మధ్య తేడా ఏంటో తెలుసా?

Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ టైంలో కనిపించే WL, RAC, CNF మధ్య తేడా ఏంటో తెలుసా?

Train Ticket Booking: రోజూ లక్షలాది మంది ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసే టైంలో WL, RAC, CNF వంటి పదాలు కనిపిస్తుంటాయి. వీటి అర్థం తెలియక కొందరు గందరగోళానికి గురవుతుంటారు. మరి ఈ మూడింటి అర్థం, వాటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందామా.. 

2 Min read
Author : Kavitha G
Published : May 22 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
WL, RAC, CNF అంటే అర్థం ఏంటి?
Image Credit : social media

WL, RAC, CNF అంటే అర్థం ఏంటి?

చాలామంది ప్రయాణికులు ట్రైన్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుంటారు. టికెట్ బుక్ చేసిన తర్వాత అందులో కనిపించే WL, RAC, CNF వంటి పదాలు చాలామందికి కన్‌ఫ్యూజన్ కలిగిస్తుంటాయి. ముఖ్యంగా మొదటిసారి రైలు ప్రయాణం చేసే వారు లేదా అత్యవసర సమయంలో టికెట్ బుక్ చేసే వారు ఈ స్టేటస్‌ల అర్థం పూర్తిగా తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ మూడు పదాల అర్థం ఏంటో, వాటి మధ్య తేడా ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
CNF అంటే ఏంటి?
Image Credit : Getty

CNF అంటే ఏంటి?

CNF అంటే కన్మర్ఫ్డ్ టికెట్(Confirmed Ticket) అని అర్థం. అంటే మీ టికెట్ పూర్తిగా కన్ఫర్మ్ అయిందని, ట్రైన్‌లో మీకు సీటు ఖరారైందని అర్థం. టికెట్‌పై కోచ్ నెంబర్, బెర్త్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రయాణ సమయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా నేరుగా మీ సీటులో కూర్చోవచ్చు. సాధారణంగా ట్రైన్‌లో సీట్లు ఖాళీ ఉన్నప్పుడు లేదా ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF స్టేటస్ వస్తుంది.

Related Articles

Related image1
Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్ల కోసం ఇన్ని సౌకర్యాలున్నాయా?
Related image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
36
WL అంటే ఏంటి?
Image Credit : stockphoto

WL అంటే ఏంటి?

WL అంటే వెయిటింగ్ లిస్ట్ (Waiting List). ట్రైన్‌లో ఉన్న అన్ని సీట్లు అప్పటికే బుక్ అయిపోయినప్పుడు కొత్తగా బుక్ చేసే వారికి ఈ స్టేటస్ కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మీకు సీటు లేదు, కానీ ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని దాని అర్థం. ఒకవేళ మీకు WL 15 ఉందని చూపిస్తే.. మీకంటే ముందు 14 మంది వెయిటింగ్‌లో ఉన్నారని అర్థం. టికెట్ క్యాన్సిలేషన్లు జరిగే కొద్దీ WL సంఖ్య తగ్గుతూ వస్తుంది. చివరకు WL జీరోకి చేరితే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా టికెట్ క్యాన్సిల్ అవుతుంది. డబ్బులు తిరిగి వస్తాయి.

46
RAC అంటే ఏంటి?
Image Credit : our own

RAC అంటే ఏంటి?

RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్ (Reservation Against Cancellation). ఇది WL, CNF మధ్య ఉండే స్టేటస్‌గా చెప్పవచ్చు. RAC టికెట్ ఉన్నవారికి ట్రైన్‌లో ప్రయాణించే హక్కు ఉంటుంది.. కానీ, పూర్తి బెర్త్ మాత్రం ఉండదు. సాధారణంగా ఇద్దరు RAC ప్రయాణికులు ఒకే బెర్త్‌ను షేర్ చేసుకోవాలి. అంటే కూర్చునే అవకాశం ఉంటుంది కానీ, పడుకునే పూర్తి బెర్త్ గ్యారంటీ ఉండదు. అయితే కొన్ని కన్ఫర్మ్ టికెట్లు క్యాన్సిల్ అయితే మాత్రం RAC టికెట్లు CNF‌గా మారే అవకాశం ఉంటుంది.

56
WL, RAC, CNF మధ్య తేడా
Image Credit : irctc

WL, RAC, CNF మధ్య తేడా

WL, RAC, CNF మధ్య ప్రధాన తేడా ప్రయాణ హక్కు, సీటు లభ్యతలో ఉంటుంది. CNF టికెట్ ఉన్నవారికి పూర్తి సీటు లేదా బెర్త్ ఖాయం. RAC ఉన్నవారికి ప్రయాణ హక్కు ఉంటుంది కానీ పూర్తి బెర్త్ ఉండకపోవచ్చు. WL ఉన్నవారికి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణానికి అనుమతి ఉండదు.

66
వెయిటింగ్ లిస్ట్ లో రకాలు
Image Credit : our own

వెయిటింగ్ లిస్ట్ లో రకాలు

వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. GNWL- జనరల్ వెయిటింగ్ లిస్ట్ (General Waiting List), PQWL-పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ (Pooled Quota Waiting List), RLWL- రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ (Remote Location Waiting List) వంటి విభాగాలు ఉంటాయి. 

వీటిలో GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టికెట్ బుక్ చేసే సమయంలో ఈ వివరాలు కూడా పరిశీలించడం మంచిది. అలాగే ట్రైన్ రూట్, సీజన్, పండగలు, సెలవులు వంటి అంశాలపై కూడా టికెట్ కన్ఫర్మేషన్ ఆధారపడి ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్ల కోసం ఇన్ని సౌకర్యాలున్నాయా?
Recommended image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved