వాస్తుశాస్త్రం ప్రకారం.. ఈ విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే మీకు డబ్బుకు కొదవే ఉండదు
జీవితంలో ప్రతి వ్యక్తి డబ్బుకు సంబంధించిన సమస్యలేవీ రాకూడదనుకుంటారు. సిరి సంపదలు మెండుగా ఉండాలనుకుంటాడు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే వాస్తుశాస్త్రంలో కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు. అవేంటంటే?
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే వాస్తు శాస్త్రంలో దిశలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం.. ప్రతి వస్తువును సరైన దిశలో ఉంచితే మాత్రమే ప్రయోజనం పొందుతారు. ఇంటి అలంకరణ కోసం కూడా ఎన్నో శిల్పాలను, విగ్రహాలను పెడుతారు. అయితే ఈ విగ్రహాలను వాస్తు ప్రకారం.. పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదు.
ఈ దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి
వాస్తు శాస్త్రంలో.. ఉత్తర దిశను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే దేవతలు, దేవుళ్లు ఈ దిశలోనే నివసిస్తారని నమ్ముతారు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచండి. దీనివల్ల మీరు ధనలాభం పొందుతారు. అంతేకాదు మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
వైవాహిక జీవితం ఆనందంగా
వాస్తు ప్రకారం.. మీరు మీ డ్రాయింగ్ రూమ్ లో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచితే.. ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే బాతు దంపతుల విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా సాగుతుంది.
నెగెటివ్ ఎనర్జీ పోతుంది
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే ఆవును పూజిస్తారు. అందుకే మీ ఇంట్లో కంచు కామధేను ఆవు విగ్రహాన్ని పెట్టండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
ఈ దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచండి
సనాతన ధర్మంలో తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. తాబేలును ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే మీరు డ్రాయింగ్ రూమ్ లో లోహంతో చేసిన తాబేలును కూడా ఉంచొచ్చు. ఇది మీ సంపదను పెంచే అవకాశం ఉంది.