- Home
- Feature
- Cool Drinks: భూమిపైనే కాదు స్పేస్ లో కూడా దొరికే కూల్ డ్రింక్, ఆ రెండు దేశాల్లో మాత్రమే బ్యాన్.. ఎందుకంటే
Cool Drinks: భూమిపైనే కాదు స్పేస్ లో కూడా దొరికే కూల్ డ్రింక్, ఆ రెండు దేశాల్లో మాత్రమే బ్యాన్.. ఎందుకంటే
ప్రపంచ వ్యాప్తంగా కూల్ డ్రింక్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచం మొత్తం దొరికే ఒక కూల్ డ్రింక్ రెండు దేశాల్లో మాత్రం దొరకదు. చివరికి ఆ కూల్ డ్రింక్ అంతరిక్షంలోకి కూడా చేరుకుంది.

Cool Drinks
ప్రపంచ వ్యాప్తంగా కూల్ డ్రింక్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. కూల్ డ్రింక్స్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలలో కోకా కోలా సంస్థ దిగ్గజం అనే చెప్పాలి. సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరూ తరచుగా కోకా కోలా కూల్ డ్రింక్స్ ని రుచి చూస్తూనే ఉన్నారు. ఇండియాలో సమ్మర్ అయితే కూల్ డ్రింక్స్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి.
ఎక్కడ చూసినా కోకా కోలా బ్రాండే
చిన్న కిరానా కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్, మల్టిఫ్లెక్స్ థియేటర్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఇలా ప్రతి చోటా కోకా కోలా కూల్ డ్రింక్స్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కోకా కోలా కూల్ డ్రింక్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ మాటకొస్తే కోకా కోలా అంతరిక్షంలో కూడా దొరుకుతుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. అవును ఇది నిజం.
అంతరిక్షంలోకి కూడా పంపారు
రోదసీలోకి వెళ్లిన తొలి సాఫ్ట్ డ్రింక్ కోకా కోలానే. 1985లో వ్యోమగాములు తాగేందుకు కోకా కోలా సంస్థ ప్రత్యేక స్పేస్ క్యాన్ ని తయారు చేసింది. దీనికోసం ఆ సంస్థ ఏకంగా అప్పట్లోనే 2,50,000డాలర్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు ఎందుకంటే.. భూమిపైనా కోకాకోలా లోని గ్యాస్ బయటకు వీళ్ళు ద్రవం కింద ఉంటుంది. కానీ గ్రావిటీ లేని అంతరిక్షంలో క్యాన్ ని ఓపెన్ చేస్తే సోడా నురగ, ద్రవం వేరు కావు. రెండూ కలసిపోయి అంతరిక్ష నౌక మొత్తం వ్యాపించి పరికరాలు పాడు చేసే అవకాశం ఉంది.
రెండు దేశాల్లో మాత్రం బ్యాన్
దీనితో కోకా కోలా సంస్థ సోడా నుంచి CO2ని వేరు చేసేలా ప్రత్యేక క్యాన్ ని డిజైన్ చేశారు. అందుకే అంత ఖర్చు అయింది. ఇలా అంతరిక్షంలోకి కూడా కోకాకోలా వెళ్ళింది. భూమిపై ఏ దేశంలో అయినా దొరుకుతుంది. కానీ రెండు దేశాల్లో తప్ప. ఆ రెండు దేశాలు మరేవో కావు ఒకటి ఉత్తర కొరియా, మరొకటి క్యూబా.
కారణాలు ఇవే
1950 యుద్ధం తర్వాత ఉత్తర కొరియాకి, అమెరికాకి రాజకీయ శత్రుత్వం ఏర్పడింది. దీనితో అప్పటి నుంచి కోకా కోలా బ్రాండ్ ని ఆ దేశంలో బ్యాన్ చేశారు. కోకా కోలాకు ప్రత్యామ్నాయంగా ఉత్తర కొరియా వాళ్ళు 'కాకో ఫ్యాక్ట' అనే ప్రత్యామ్నాయ కూల్ డ్రింక్ ని తయారు చేసుకున్నారు. క్యూబాది కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. అమెరికా హోం రాజకీయ విరోధం కారణంగా 1962 నుంచి కోకా కోలాని బ్యాన్ చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు 'తుకోలా' అనే బ్రాండ్ తయారు చేసుకున్నారు. ఇక రష్యా అయితే కోకా కోలాతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. పూర్తిగా బ్యాన్ చేయలేదు. కోకా కోలాని దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
కోకాకోలాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ బాగా తెలిసిన పదాల్లో 'OK' మొదటి స్థానంలో ఉండగా.. 'Coco Cola' రెండవ స్థానంలో ఉంది.





