- Home
- Feature
- Edible Battery: ఈ బ్యాటరీని మింగేయచ్చు.. పొట్టలోనే పూర్తిగా కరిగిపోతుంది, దీన్ని ఎందుకు తయారుచేశారో తెలుసా?
Edible Battery: ఈ బ్యాటరీని మింగేయచ్చు.. పొట్టలోనే పూర్తిగా కరిగిపోతుంది, దీన్ని ఎందుకు తయారుచేశారో తెలుసా?
New Battery: ఇదొక కొత్తరకం బ్యాటరీ. పొరపాటును పొట్టలోకి వెళ్లిన ఏమీ కాదు. ఎంచక్కా కరిగిపోతుంది. పైగా దీన్ని కాగితంతో చేస్తారు కాబట్టి పొట్టలోనే కరిగిపోతుంది. ఎలాంటి హాని చేయదు.

బ్యాటరీ మింగేసిన ఓకే
బ్యాటరీలలో కొత్త శకం మొదలైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు తినదగిన కాగితలు బ్యాటరీలు తయారుచేశారు. ప్రఖ్యాత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణను రూపొందించారు. సాధారణంగా మనం వాడే చిన్న చిన్న బ్యాటరీలు లేదా పరికరాలు కడుపులో ఉండిపోతే వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ కొత్త రకం బ్యాటరీ మింగడానికి ఎంతో సులువుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది తన నిర్ణీత పనిని పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలు లేదా అవశేషాలు మిగల్చకుండా కడుపులో పూర్తిగా కరిగిపోతుంది.
దేనితో తయారుచేశారు?
ఈ ప్రత్యేకమైన బ్యాటరీ తయారీలో ఎలాంటి హానికరమైన పదార్థాలను ఉపయోగించలేదు. దీనిలో నెగెటివ్ వైపు కోసం మెగ్నీషియంను, పాజిటివ్ వైపు కోసం మాలిబ్డినం ట్రైయాక్సైడ్‌ను ఉపయోగించారు. వీటిని మొక్కల నుంచి సేకరించిన సెల్యులోజ్ నానోఫైబ్రిల్స్‌తో కలిపి ఒక కాగితంలా తయారు చేశారు. ఇది కడుపులోని ఆమ్లాలను తట్టుకునేలా, నిర్దిష్ట సమయం పాటు పనిచేసేలా పైన తేనెటీగ మైనంతో (బీవ్యాక్స్) కప్పబడి ఉంటుంది. సాధారణంగా వాడే లిథియం-అయాన్ బ్యాటరీలు కనుక పొరపాటున లీకైతే తీవ్రమైన కాలిన గాయాలు లేదా అంతర్గత గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ కొత్త బయో-బ్యాటరీ సురక్షితంగా మరియు సహజంగా కరిగిపోవడం వల్ల ఆ భయాలన్నింటికీ పూర్తిగా చెక్ పెట్టవచ్చు.
పందులపై ప్రయోగం
ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ బ్యాటరీలను జంతువులపై (పందులపై) విజయవంతంగా ప్రయోగించారు. కడుపులో ఉన్న సమయంలో ఈ బ్యాటరీ వైర్‌లెస్ ద్వారా సమాచారాన్ని పంపడమే కాకుండా, కడుపులోని ఆకలి హార్మోన్లను కూడా ఉత్తేజపరిచేలా అద్భుతంగా పనిచేసింది. అయితే, ఈ బ్యాటరీ ఒక్కటే కరిగిపోతే సరిపోదు, దానితో పాటు ఉండే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు కూడా పూర్తిగా జీర్ణమయ్యేలా లేదా కరిగిపోయేలా మార్పులు రావాల్సి ఉంది. ఈ సాంకేతికత ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వైద్య రంగంలో ఇదొక పెద్ద విప్లవంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్లు ఆపరేషన్లు చేయకుండానే కడుపులోని సమస్యలను సులువుగా పర్యవేక్షించడానికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

