MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • 3-Pin Plug : 3 పిన్ ప్లగ్‌లో పెద్దగా, మందంగా ఉండే పిన్ ను ఏమంటారు? దీని ఉపయోగం ఏంటి?

3-Pin Plug : 3 పిన్ ప్లగ్‌లో పెద్దగా, మందంగా ఉండే పిన్ ను ఏమంటారు? దీని ఉపయోగం ఏంటి?

3-పిన్ ప్లగ్‌లలో ఒక పిన్ మిగతా రెండింటి కంటే భిన్నంగా పొడవుగా, లావుగా ఉంటుంది. ఇది స్టైల్ కోసం కాదు దీని వెనుక ప్రాణాలను కాపాడే సైన్స్, భద్రతా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 08 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 త్రీ పిన్ ప్లగ్ లో పొడవుగా ఉండే ప్లగ్ ను ఏమంటారు?
Image Credit : stockPhoto

త్రీ పిన్ ప్లగ్ లో పొడవుగా ఉండే ప్లగ్ ను ఏమంటారు?

 మన ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ వంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులకు 3-పిన్ ప్లగ్‌నే వాడతాం. ఇందులో సాధారణ ప్లగ్ లో మాదిరిగా రెండు పిన్స్ సమానంగా ఉంటాయి… అదనంగా ఇంకో పిన్ పొడవుగా, లావుగా ఉంటుంది. దీన్ని ఎర్త్ పిన్ అంటారు. ఇది కేవలం డిజైన్ కోసం కాదు. దీని వెనుక మన ప్రాణాలను కాపాడే ఓ పెద్ద ఇంజినీరింగ్ ట్రిక్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎర్త్ పిన్ పొడవుగా ఉండటానికి కారణం ఏమిటి?
Image Credit : stockPhoto

ఎర్త్ పిన్ పొడవుగా ఉండటానికి కారణం ఏమిటి?

మనం ప్లగ్‌ను సాకెట్‌లో పెట్టినప్పుడు పెద్దగా ఉండే ఎర్త్ పిన్ మొదట లోపలికి వెళ్తుంది. ప్లగ్‌ను తీసేటప్పుడు కూడా అదే చివరిగా బయటకు వస్తుంది. దీనివల్ల పరికరంలో ఏదైనా కరెంట్ లీక్ అయితే, ఆ విద్యుత్ మన శరీరానికి చేరకముందే ఆ పెద్ద పిన్ ద్వారా సురక్షితంగా భూమిలోకి వెళ్లిపోతుంది. అందుకే మనకు షాక్ కొట్టదు.  

35
2-పిన్, 3-పిన్ ప్లగ్‌ లకు తేడాా ఏమిటి?
Image Credit : stockPhoto

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ లకు తేడాా ఏమిటి?

ఏసీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్, గీజర్‌ల వంటి వాటికి మెటల్ బాడీ (Metal Casing) ఉంటుంది. వీటిలో కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం ఎక్కువ… అందుకే సేప్టీ కోసం ఎర్త్ పిన్ తో కూడిన త్రీ పిన్ ప్లగ్ ఉంటుంది. మొబైల్ ఛార్జర్లు, ట్రిమ్మర్ల వంటి తక్కువ కరెంట్ తీసుకునే వాటికి ఈ ప్రమాదం తక్కువ. అందుకే వాటికి 2-పిన్ ప్లగ్ సరిపోతుంది. 

45
ప్రాణాలను కాపాడే ఎర్త్ పిన్
Image Credit : stockPhoto

ప్రాణాలను కాపాడే ఎర్త్ పిన్

ఎక్కువ కరెంట్ తీసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులకు సరైన ఎర్త్ కనెక్షన్ లేకపోతే, వాటిని తాకినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే అన్ని భారీ పరికరాలకు 3-పిన్ ప్లగ్‌లు వాడతారు. ఈ ప్లగ్ సాకెట్‌లోకి వెళ్లగానే న్యూట్రల్, ఫేజ్ పిన్‌లు కనెక్ట్ అవ్వకముందే ఎర్త్ పిన్ కనెక్ట్ అవుతుంది. అంటే పరికరానికి పవర్ అందకముందే ఎర్త్ సిస్టమ్ పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ లేదా కరెంట్ లీక్ అయినా విద్యుత్ మన శరీరానికి చేరదు.  

55
3-పిన్ ప్లగ్ లో దాగున్న భౌతిక శాస్త్రం
Image Credit : stockPhoto

3-పిన్ ప్లగ్ లో దాగున్న భౌతిక శాస్త్రం

ఎర్త్ పిన్ లావుగా ఉండటం వల్ల, దాన్ని పొరపాటున కూడా ఫేజ్ లేదా న్యూట్రల్ హోల్స్‌లో పెట్టలేం. డిజైన్ మారితే ప్రమాదం కాబట్టి దాని స్థానం అదేనని నిర్ధారించడానికి దాన్ని లావుగా తయారుచేశారు. 

భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం… ఒక వాహకం (conductor) మందం పెరిగేకొద్దీ దాని విద్యుత్ నిరోధకత (resistance) తగ్గుతుంది. కరెంట్ లీక్ అయినప్పుడు విద్యుత్ మన శరీరాన్ని చేరేకంటే ముందే చాలా తక్కువ నిరోధకత ఉన్న లావుపాటి ఎర్త్ పిన్ ద్వారా వేగంగా భూమిలోకి వెళ్లిపోతుంది. కాబట్టి కరెంట్ షాక్ ప్రమాదం నుండి బయటపడవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే… ఎర్త్ పిన్ పొడవుగా, లావుగా ఉండటం వల్ల అది సాకెట్‌తో మొదట కనెక్ట్ అవుతుంది. అలాగే విద్యుత్‌ను సులభంగా, సురక్షితంగా భూమిలోకి పంపడానికి సహాయపడుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Generic Medicine: జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి? జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు తేడా ఏమిటి?
Recommended image2
Lost Rivers India: ఇండియాలో కనిపించకుండా మాయమైపోయిన నదులు ఇవి.. అసలు కారణాలు ఏంటి?
Recommended image3
DMart: సూపర్ మార్కెట్లో క్యారీ బ్యాగ్ కు డబ్బులు కడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
Related Stories
Recommended image1
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Mini Juicer: ఒక్క బటన్ నొక్కితే...ఫ్రెష్ జ్యూస్ రెడీ, కరెంట్ అవసరం లేదు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved