MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Facts : మిల్లీగ్రాముల గుండుసూది సైతం నీటిలో మునుగుతుంది.. లక్షల టన్నుల షిప్ ఎలా తేలుతుంది?

Facts : మిల్లీగ్రాముల గుండుసూది సైతం నీటిలో మునుగుతుంది.. లక్షల టన్నుల షిప్ ఎలా తేలుతుంది?

చిన్న గుండుసూదిని నీళ్లలో వేస్తే మునిగిపోతుంది. కానీ లక్షల టన్నుల బరువుండే షిప్ మాత్రం నీటిపై తేలుతుంది. ఎప్పుడైనా ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించారా? ఓడలు సముద్రంలో తేలడం వెనకున్న 'సైన్స్' ఏంటో చూద్దాం రండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 03 2026, 10:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ షిప్స్ నీటిపై తేలడంవెనకున్న సైన్స్ ఏంటి?
Image Credit : x/DealsDhamaka

భారీ షిప్స్ నీటిపై తేలడంవెనకున్న సైన్స్ ఏంటి?

నీళ్లలో ఏ వస్తువు వేసినా మునిగిపోవడం కామన్. చిన్న ఇనుప మేకును విసిరినా అది మునిగిపోతుంది. కానీ పెద్దపెద్ద ఇనుప ఓడలు నీటిపై తేలడం మాత్రం పెద్ద అద్భుతం. ఓడలు తేలడం వెనుక ఓ అద్భుతమైన సైన్స్ సూత్రం ఉంది. దీనికి కారణం ప్లవన బలం (Buoyancy), ఆర్కిమెడిస్ సూత్రం. ఈ రెండు సైన్స్ సూత్రాల గురించి ఈ గ్యాలరీలో సింపుల్‌గా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ ఆర్కిమెడిస్ సూత్రం?
Image Credit : Disney Cruise Line

ఏమిటీ ఆర్కిమెడిస్ సూత్రం?

సుమారు 2300 ఏళ్ల క్రితమే ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ ఓ సూత్రాన్ని కనుగొన్నాడు. దీని ప్రకారం… ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు, అది తన బరువుకు సమానమైన నీటిని పక్కకు తొలగిస్తుంది. అలా తొలగించిన నీటి బరువు ఆ వస్తువు బరువుకు సమానంగా లేదా ఎక్కువగా ఉంటే అది నీటిపై తేలుతుంది. ఓడలు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. ఓడ సముద్రంలోకి వెళ్లినప్పుడు, దాని భారీ ఆకారం వల్ల లక్షల టన్నుల సముద్రపు నీటిని పక్కకు నెట్టేస్తుంది. ఇలా ఓడ తొలగించిన నీటి బరువు, ఓడ మొత్తం బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓడ ఈజీగా తేలుతుంది.

Related Articles

Related image1
Facts : టిష్యూ పేపర్లు తెల్లగా ఎందుకుంటాయి? రంగురంగులుగా ఎందుకుండవు?
Related image2
Facts : ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
34
 ఏమిటీ ప్లవన బలం?
Image Credit : Meta AI

ఏమిటీ ప్లవన బలం?

ఓడ తేలడానికి మరో కారణం ప్లవన బలం (Buoyancy). అంటే నీటిలో ఒక వస్తువును వేసినప్పుడు, నీరు ఆ వస్తువుపై పైకి ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. దీన్నే ఊర్ధ్వ పీడనం లేదా ప్లవన బలం అంటారు. చిన్న ఇనుప మేకు ఆకారం చాలా చిన్నది… అది నీళ్లలోకి వెళ్లినప్పుడు చాలా తక్కువ నీటిని తొలగిస్తుంది. అందుకే నీటి పైకి నెట్టే బలం కన్నా మేకు కిందికి లాగే బలం ఎక్కువగా ఉండి.. అందుకే అది మునిగిపోతుంది. కానీ ఓడకు చాలా పెద్ద ఉపరితలం ఉండటంతో, అది ఎక్కువ నీటిని తొలగిస్తుంది. దీనివల్ల నీటి పైకి నెట్టే బలం, ఓడ బరువును పైకి లేపి నిలబెడుతుంది.

44
ఓడ నీటిలో తేలడానికి కారణమివే..
Image Credit : stockPhoto

ఓడ నీటిలో తేలడానికి కారణమివే..

ఓడ తేలడానికి దాని డిజైన్ చాలా హెల్ప్ అవుతుంది. ఓడ మొత్తం ఇనుముతోనే చేయరు. ఓడ లోపలి భాగం చాలా వరకు ఖాళీగా, అంటే గాలితో నిండి ఉంటుంది. ఇనుము, ఓడ లోపల ఉన్న గాలి మొత్తం సాంద్రతను లెక్కిస్తే, అది సముద్రపు నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. అందుకే ఓడ నీటిపై హాయిగా తేలుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే, ఓడ బరువు దాన్ని కిందికి లాగుతుంది (గురుత్వాకర్షణ శక్తి). కానీ ఓడ భారీ ఆకారం వల్ల తొలగిపోయిన నీరు, దాన్ని పైకి నెడుతుంది (ప్లవన బలం). ఈ రెండు బలాలు సమానంగా ఉన్నప్పుడు, లక్షల టన్నుల బరువున్న ఓడ కూడా సముద్రంలో ఈజీగా తేలుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, బ‌ల‌హీన‌త అస‌లే కాదు.. మ‌రెంటో తెలుసా.?
Recommended image2
విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
Recommended image3
Hotel Secrets : హోటల్ రూమ్‌లో గోడ గడియారం ఎందుకుండదు? దీనివెనక ఇంతపెద్ద బిజినెస్ ట్రిక్ దాగుందా?
Related Stories
Recommended image1
Facts : టిష్యూ పేపర్లు తెల్లగా ఎందుకుంటాయి? రంగురంగులుగా ఎందుకుండవు?
Recommended image2
Facts : ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved