MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts : టిష్యూ పేపర్లు తెల్లగా ఎందుకుంటాయి? రంగురంగులుగా ఎందుకుండవు?

Facts : టిష్యూ పేపర్లు తెల్లగా ఎందుకుంటాయి? రంగురంగులుగా ఎందుకుండవు?

మనం వాడే టిష్యూ పేపర్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి… ఎందుకిలా ఉంటాయో ఆలోచించారా? దీని వెనక అనేక కారణాలున్నాయి. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 30 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టిష్యూ పేపర్ తెల్లగానేే ఎందుకు?
Image Credit : pisabay

టిష్యూ పేపర్ తెల్లగానేే ఎందుకు?

ఇల్లు, ఆఫీస్, హోటల్, రెస్టారెంట్.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు టిష్యూ పేపర్ల వాడకం కామన్ అయిపోయింది. కఅయితే ఎప్పుడైనా ఈ టిష్యూలు ఎప్పుడూ తెల్లగానే ఎందుకుంటాయని ఆలోచించారా? ఇది కేవలం లుక్ కోసం కాదు. ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం.. ఇలా దీని వెనుక చాలా కారణాలున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెల్లటి టిష్యూలనే ఎక్కువగా వాడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రజల నమ్మకం
Image Credit : pisabay

ప్రజల నమ్మకం

తెలుపు రంగును సాధారణంగా శుభ్రత, పరిశుభ్రతకు చిహ్నంగా చూస్తాం. టిష్యూ పేపర్లను ముఖం, చేతులు తుడుచుకోవడానికి, కొన్నిసార్లు ఆహారం కోసం కూడా వాడతాం. అందుకే  తెలుపు రంగులో ఉంటే అవి శుభ్రంగా, సురక్షితంగా ఉన్నాయని ప్రజలు నమ్ముతారు.

35
తెలుపు టిష్యూ పేపర్లలో అలర్జీకి చెక్
Image Credit : Getty

తెలుపు టిష్యూ పేపర్లలో అలర్జీకి చెక్

రంగుల టిష్యూ పేపర్లలో డైస్, రసాయనాలు వాడతారు. కొంతమందికి చర్మం చాలా సున్నితంగా (సెన్సిటివ్) ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ రంగుల వల్ల అలర్జీలు లేదా చికాకు కలగవచ్చు. అదే రంగులు లేని తెల్లటి టిష్యూ అయితే చర్మానికి చాలా సురక్షితం.

ముఖం, చర్మంపై వాడే వస్తువుల్లో రసాయనాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తెల్లటి టిష్యూ పేపర్లకు రంగులు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి, వీటి వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

45
పర్యావరణ సంరక్షణ కోసం
Image Credit : pisabay

పర్యావరణ సంరక్షణ కోసం

 టిష్యూ పేపర్లను నీటిలో వేయగానే త్వరగా కరిగిపోయేలా డిజైన్ చేస్తారు. తెల్లటి టిష్యూలలో సాధారణంగా రంగులు, హానికరమైన రసాయనాలు ఉండవు. కాబట్టి వీటిని పారేయడం (డిస్పోజ్ చేయడం) చాలా సులభం.

రంగుల టిష్యూలలో రకరకాల రసాయనాలు ఉంటాయి. అదే తెల్లటి టిష్యూలలో తక్కువ కెమికల్స్ వాడతారు. దీనివల్ల పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుంది. వీటిని డిస్పోజ్ చేయడం కూడా చాలా సులభం.

55
తెల్లటి టిష్యూ ఉత్పత్తికి ఖర్చు తక్కువ
Image Credit : pisabay

తెల్లటి టిష్యూ ఉత్పత్తికి ఖర్చు తక్కువ

టిష్యూ పేపర్లను భారీ మొత్తంలో తయారు చేస్తారు. వీటికి రకరకాల రంగులు, డిజైన్లు జోడిస్తే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ తెల్లటి టిష్యూలను తయారు చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ. అందుకే కంపెనీలకు, వినియోగదారులకు కూడా ఇదే లాభదాయకం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Recommended image2
ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
Recommended image3
Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
Related Stories
Recommended image1
Facts : రూ.50, రూ.100, రూ.200 నోట్లను ప్రజలు ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరూ ఇలాగే చేస్తారు
Recommended image2
Facts : ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved