MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? చావు అంచులదాకా వెళ్లి బతికినోళ్లు చెప్పే షాకింగ్ నిజాలు

మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? చావు అంచులదాకా వెళ్లి బతికినోళ్లు చెప్పే షాకింగ్ నిజాలు

చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డ వాళ్లు చెప్పే అనుభవాలు ఆశ్చర్యంగా, మిస్టరీగా ఉంటాయి. వీరి మాటలను బట్టి ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసా..?   

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 18 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చావు గురించి వింత నిజాలు...
Image Credit : unsplash

చావు గురించి వింత నిజాలు...

మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఇది ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. అయితే హిందూ మతం ప్రకారం చివరి క్రిియలు ముగిసేవరకు ఆత్మ శరీరం చుట్టే తిరుగుతుంది. ఇక ముస్లిం, క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం చనిపోగానే ఆత్మ స్వర్గం లేదా నరకం చేరుకుంటుంది. ఇలా మనిషి చావుపై మతాచారాలు చెప్పేది ఒకలా ఉంటే సైన్స్ చెప్పే కారణాలు మరోలా ఉన్నాయి. దీంతో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.

అయితే చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాళ్లు చెప్పే కథనాల్లో చాలా లోతైన విషయాలు, ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి. చావుకు దగ్గరగా వెళ్లినవారి అనుభవాలను బట్టి చనిపోయాక ఏం జరుగుతోంది ఓ అంచనాకు రావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది?
Image Credit : Gemini AI

మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది?

  1. శరీరం నుండి బయటకు రావడం

చాలామంది తాము పడుకున్న బెడ్‌ను, తమకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్లను పైనుంచి చూసినట్లు చెబుతారు. ఉదాహరణకు హార్ట్ సర్జరీ టైంలో స్పృహలో లేని చాలామంది పేషెంట్లు, తమ శరీరాన్ని వదిలి బయటకు వచ్చి, రూమ్‌లో జరిగిన సంభాషణలను కరెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. 

2. చావు భయం పోవడం 

మరణం అంచులకు వెళ్లొచ్చిన వాళ్లు చావును ఒక 'ముగింపు'గా కాకుండా ఒక 'మార్పు' లేదా 'విముక్తి'గా చూస్తారు. లీండా ప్రింగిల్ అనే మహిళ అనారోగ్యంతో ఉన్నప్పుడు తన శరీరం నుంచి బయటకు తేలుతున్నట్లు, ఒక విశ్వవ్యాప్తమైన ప్రేమను ఫీలైనట్లు వివరించారు.

3. వర్ణించలేని ప్రశాంతత, వెలుగు

చాలామందికి ఈ అనుభవం ఒక దైవికమైన ప్రశాంతతను, భయం లేని స్థితిని ఇస్తుంది. టామీ మెక్‌డొవెల్ అనే మాజీ సైనికుడు తీవ్ర అనారోగ్యం టైంలో తాను చూసిన 'వెలుగు నిండిన ప్రపంచం' తన బాధలను కడిగేసిందని ఎమోషనల్‌గా చెప్పారు.

4. లైఫ్ రీప్లే

కొందరు తమ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒకే క్షణంలో మెరుపు వేగంతో కళ్ల ముందు కనిపించాయని చెబుతారు. ఇది వాళ్లను ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది. 

5. స్పోర్ట్స్ ప్లేయర్ల అనుభవం

మోటోజీపీ (MotoGP) రేసర్ జార్జ్ మార్టిన్ ఒక యాక్సిడెంట్ తర్వాత తనకు కలిగిన అనుభవాన్ని ఇలా చెప్పారు. "నేను చనిపోతున్నానని నాకు అర్థమైంది. ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది."

6. చనిపోయిన బంధువులను కలవడం

చాలా స్టడీస్‌లో చనిపోయిన తమ ఆత్మీయులు తమను ఆహ్వానించడానికి వచ్చినట్లు లేదా "నీ టైం ఇంకా రాలేదు, వెనక్కి వెళ్లు" అని చెప్పినట్లు కథలున్నాయి.

34
వైద్య ప్రపంచానికి కొత్త సవాల్
Image Credit : Chatgpt

వైద్య ప్రపంచానికి కొత్త సవాల్

చావు అంచుల్లోని వారి అనుభవాలు కేవలం మెదడులోని రసాయన మార్పులు మాత్రమే కాదని వాదించేవాళ్లూ ఉన్నారు. వాళ్లు అడిగే ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే "మెదడు పనిచేయడం ఆగిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి పక్క సర్జరీ రూమ్‌లో ఏం జరుగుతుందో కరెక్ట్‌గా ఎలా చూడగలడు?" ఇది 'శరీరంపై ఆధారపడని చైతన్యం' (Non-local consciousness) అనే సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. చాలామంది పేషెంట్లు ఇలాంటి అనుభవాల తర్వాత ఎవరితోనూ పంచుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

44
 వింత అనుభూతుల ప్రయాణం
Image Credit : Chatgpt

వింత అనుభూతుల ప్రయాణం

ప్రస్తుత పరిశోధనల ప్రకారం… మరణం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయే ప్రక్రియ కాదు. అది మెదడుకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన, విచిత్రమైన ప్రయాణం. మెడికల్ టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి మెదడు చేసే ఈ చివరి ప్రయాణం గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. కానీ ఒక్కటైతే నిజం.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాళ్లు తమ జీవితాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూస్తున్నారు. ఈ అనుభవాలు సైన్స్‌కు, ఆధ్యాత్మికతకు మధ్య వారధిలా నిలుస్తూ, మనిషి ఉనికిలోని మిస్టరీని మనకు గుర్తుచేస్తూనే ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Uniform Colors : డాక్టర్లు తెల్లకోటు, పోలీసులు ఖాకీ డ్రెస్.. ఏ యూనిఫామ్ వెనక ఏ అర్థం దాగుందో తెలుసా?
Recommended image2
Rats Behavior : ఎలుకలు ఏ వస్తువులనైనా ఎందుకు కొరికి పాడుచేస్తాయి? అసలు కారణం ఇదే..!
Recommended image3
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Related Stories
Recommended image1
Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే
Recommended image2
Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved