- Home
- Feature
- మీరు తిన్న ఆహారమే కాదు అంతరిక్షంలో ఉండే ఈ వస్తువు కూడా భూమి మీద మనుషుల హైబీపీని పెంచేస్తోంది
మీరు తిన్న ఆహారమే కాదు అంతరిక్షంలో ఉండే ఈ వస్తువు కూడా భూమి మీద మనుషుల హైబీపీని పెంచేస్తోంది
హైబీపీ మనం తిన్న ఆహారం వల్లే పెరుగుతుందని అనుకుంటారు. అది చాలా వరకు నిజం. అయితే అంతరిక్షంలో జరిగే కొన్ని మార్పులు కూడా మనలో పెంచేస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.

సూర్యుడి వల్ల హైబీపీ
ఇప్పుడు హైబీపీ, డయాబెటిస్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ఎక్కువ మందికి ఉన్నది హైబీపీ. మనం తినే ఆహారం, లైఫ్ స్టైల్ వల్లే హైబీపీ వస్తుందని అనుకుంటారు. అది చాలా వరకు నిజం. అయితే అంతరిక్షంలో జరిగే కొన్ని ఖగోళ మార్పులు కూడా భూమిపై ఉన్న మనిషిలోని హైబీపీ పెరగడానికి కారణం అవుతుంది. చైనాలో చేసిన కొత్త అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేసింది. సూర్యుడు చుట్టూ జరిగే కొన్ని కార్యాకలాపాలు మన మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా రక్తపోటును పెంచేస్తాయని వివరిస్తోంది.
చైనాలో చేసిన అధ్యయనం
చైనాలో నిర్వహించిన ఈ కొత్త అధ్యయనం ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సూర్యుని కదలిక అంతరిక్షానికే పరిమితం అవుతుందని అనుకుంటాం. నిజానికి భూమి, భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన తెలిపింది. సూర్యుడి కారణంగా భూ అయస్కాంత క్షేత్రంలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. వీటివల్ల ఆ భూమి పై నివసిస్తున్నా మనుషుల రక్తపోటు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధన గత ఆరేళ్లుగా ఐదు లక్షల మంది ప్రజలపై నిర్వహించారు.
ఎందుకు రక్తపోటు పెరుగుతుంది?
సూర్యుని వల్ల భూమి అయస్కాంత క్షేత్రంలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయని... వాటికి తగ్గట్టే మనిషి రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడతాయని అధ్యయనం కనుక్కుంది. అంటే సూర్యుడు.. భూమి పై చూపించే ప్రభావం అదే రీతిన మనిషిపై కూడా పడుతుంది. ఇవే కాకుండా ఉష్ణోగ్రత, వాయు కాలుష్యం కూడా రక్తపోటును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలుగానే చెప్పుకోవాలి. కానీ ఈ రెండింటితో పోలిస్తే అయస్కాంత క్షేత్రంలోని అయస్కాంత శక్తులు మన రక్తపోటు పై ఒక భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
చైనాలో చేసిన ఈ తాజా అధ్యయనం నివేదిక కమ్యూనికేషన్స్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు. భూ అయస్కాంత ఆటంకాలలోని తీవ్రతను ప్రతిబింబించేలా మన రక్తపోటు స్థాయిలో పెరుగుతూ తగ్గుతూ ఉంటాయని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రతి ఆరు నెలలకు లేదా ప్రతి మూడు నెలలకు అయస్కాంత క్షేత్రంలోని హెచ్చుతగ్గులు పునరావృతం అవుతూ ఉంటాయని ఈ అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో మనిషి రక్తపోటులో కూడా విపరీతమైన ప్రభావం కనిపిస్తుంది.
సౌర తుపానులతో రక్తపోటు
సూర్యుడు పై అప్పుడప్పుడు సౌర తుఫానులు వస్తూ ఉంటాయి. ఇవి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అటువంటి సమయంలో భూ అయస్కాంత వాతావరణంలో మార్పులు త్వరగా కనిపిస్తాయి. ఆ సమయంలోనే భూమిపై ఉన్న మనిషి రక్తపోటు కూడా వేగంగా స్పందిస్తుంది. ముఖ్యంగా పురుషులు కంటే మహిళల్లోనే ఈ రక్తపోటు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
అధిక రక్తపోటుతో ఇప్పటికే బాధపడుతున్న వారికి భూ అయస్కాంత క్షేత్రం ప్రభావం వల్ల కలిగే మార్పులు కూడా తీవ్రమైన ప్రమాదాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ప్రభావితం అవుతున్నారు. అధ్యయనకర్తలు చెబుతున్న ప్రకారం వైద్యులు అంతరిక్ష వాతావరణము కూడా పరిగణనలోకి తీసుకొని ప్రజారాజ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సౌర తుపానులు ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు కూడా అంతరాయాన్ని కలిగిస్తాయి.
వైద్యుల్లోనూ అవగాహన
భూమికి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు మానవ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. అయస్కాంత కార్యా కలాపాలు రక్తపోటుని ఎందుకు ప్రభావితం చేస్తున్నాయో, అధిక సౌర తుపానులు ఏర్పడే సమయంలో ప్రజలు తమన్న తాము ఎలా కాపాడుకోవాలో చెప్పాలంటే మరిన్ని పరిశోధనలు అవసరం పడతాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఇప్పటివరకు మనం అనుకున్న దానికంటే విశ్వంలోని శక్తులతో మనుషుల ఆరోగ్యం ముడిపడి ఉంది. మన గుండె రక్తనాళాలు సూర్యుని దగ్గర మార్పులను కచ్చితంగా అనుభూతి చెందుతాయని = అధ్యయనం నిర్ధారిస్తోంది.