MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sudheer Babu: సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ చెల్లి పెట్టిన కండిషన్ ఏంటి..?

Sudheer Babu: సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ చెల్లి పెట్టిన కండిషన్ ఏంటి..?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ చిన్న కుమార్తెను హీరో సుధీర్ బాబును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే... సుధీర్ బాబుతో పెళ్లి విషయంలో మహేష్ సోదరి ప్రియదర్శిని ఓ కండిషన్ పెట్టిందని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 03 2026, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మహేష్ సోదరి ప్రియదర్శిని...
Image Credit : Instagram/ priyadarshini

మహేష్ సోదరి ప్రియదర్శిని...

టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు బావ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మూస కథలతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు చేస్తూ.. సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా.. 20 ఏళ్ల క్రితమే.. సుధీర్ బాబుకి.. కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని తో వివాహం జరిగింది. వీరిది.. పెద్దలు కుదర్చిన వివాహం. అయితే.. వీరి పెళ్లి సందర్భంలో.. జరిగిన ఓ విషయాన్ని తాజాగా మహేష్ చెల్లెలు ప్రియదర్శిని.. బయట పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పెళ్లికి పెట్టిన కండిషన్ ఇది...
Image Credit : Instagram/ priyadarshini

పెళ్లికి పెట్టిన కండిషన్ ఇది...

మహేష్ బాబు అక్క మంజుల అందరికీ తెలుసు. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించారు. కానీ.. చెల్లెలు ప్రియదర్శిని సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మందికి తెలీదు. సుధీర్ బాబు సినిమాల్లోకి వచ్చిన తర్వాతే.. మహేష్ కి ఓ చెల్లి ఉంది అనే విషయం బయటకు వచ్చింది. కాగా.. ఆ మధ్య మంజుల.. యూట్యూబ్ లో ఓ చిన్న టాక్ షో చేశారు. దానికి చాలా మంది సెలబ్రెటీలను పిలిచి.. వారిని ఇంటర్వ్యూ చేశారు. దానిలో భాగంగానే... ఓ సారి సుధీర్ బాబు, ప్రియదర్శిని కూడా వచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో.. ‘ సుధీర్ బాబుని మొదటిసారి చూసినప్పుడు ఏం అనిపించింది?’ అని మంజుల అడిగారు. దానికి ప్రియదర్శిని.. ‘ నేను పెళ్లి విషయంలో మొదటి నుంచి ఒక కండిషన్ పెట్టుకున్నాను. చిన్నప్పటి నుంచి.. అందమైన ముఖాలను చూస్తూ పెరిగాను. కాబట్టి.. నాకు కూడా అందంగా ఉండే వ్యక్తే భర్తగా కావాలి అని చెప్పాను. పెళ్లి చూపులకు సుధీర్ మొదటిసారి ఇంటికి వస్తున్నప్పుడు.. అబ్బాయి చాలా బాగున్నాడు అని వదిన చెప్పింది. కానీ.. నేను నమ్మలేదు. వదిన అలానే అంటుందిలే అని అనుకున్నాను. కానీ.. కింద సుధీర్ లోపలికి వస్తున్నప్పుడు వదిన నన్ను పిలిచి చూపించింది. వెంటనే సుధీర్ ని చూసి.. వీడేంటి ఇంత బాగున్నాడు అని అనుకున్నాను’ అని ప్రియదర్శిని తన మనసులో మాటను బయటపెట్టింది. కాగా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Related image1
Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!
Related image2
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
33
సినిమాల్లోకి రావడంపై సుధీర్ బాబు...
Image Credit : Instagram/ priyadarshini

సినిమాల్లోకి రావడంపై సుధీర్ బాబు...

ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మాటలు వినిపించాయి. హీరో అవ్వడం కోసమే..కృష్ణ కూతురిని పెళ్లి చేసుకున్నాడనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే.. ఆ మాటలకు సుధీర్ బాబు చెక్ పెట్టాడు. ప్రియదర్శిని పెళ్లి చేసుకునే సమయంలో తనకు అసలు.. సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదని చెప్పాడు. ఇక.. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కూడా త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరి పెద్ద కుమారుడు చరిత్ మానస్ మాత్రం చూడటానికి అచ్చం మహేష్ బాబులాగానే ఉండటం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
Recommended image2
Soundarya: సౌందర్య వల్లే `మిస్ యూ' అనే పదం ఎంత భారమైనదో తెలిసింది.. అర్జున్‌ సర్జా ఎమోషనల్‌
Recommended image3
Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!
Recommended image2
Heavy Rani Haar: ఈ హారం వేేసుకుంటే.. మహారాణిలా మెరిసిపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved