MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Dating: పెళ్లికి ముందే శృంగారం, ఒకే ఇంట్లో కలిసి కాపురం.. నచ్చితేనే వివాహం, ఇండియాలో వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Dating: పెళ్లికి ముందే శృంగారం, ఒకే ఇంట్లో కలిసి కాపురం.. నచ్చితేనే వివాహం, ఇండియాలో వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Dating: ఈమధ్య సహజీవన వ్యవస్థ సమాజంలో బాగా పెరిగిపోయింది. పెళ్లికి ముందు కలిసి తిరగడమే తప్పుగా భావించి మనదేశంలో.. కలిసి కాపురం చేసిన తరువాత నచ్చితేనే పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉన్న ప్రాంతం గురించి మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియాలో వింత సంప్రదాయం ఉన్న ప్రాంతం..
Image Credit : Asianet News

ఇండియాలో వింత సంప్రదాయం ఉన్న ప్రాంతం..

భారతదేశంలో వివాహ సంప్రదాయాలు ప్రాంతానికో విధంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ పెళ్లి చూపులు ఇప్పటికీ కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో యువత తమకు నచ్చిన భాగస్వామిని స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొన్ని గిరిజన సమాజాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఒక ప్రత్యేక సంప్రదాయం దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పెళ్లికి ముందే శృంగారం అక్కడ సాధారణ విషయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఛత్తీస్‌గఢ్‌ గిరిజన తెగలో పెళ్లికి ముందే శృంగారం..
Image Credit : facebook

ఛత్తీస్‌గఢ్‌ గిరిజన తెగలో పెళ్లికి ముందే శృంగారం..

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో గోండు, మురియా వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తారు. అడవులు అధికంగా ఉన్న ఈ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. అయితే ఈ గిరిజన సమాజాల ప్రత్యేకత వారి జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాల్లో కనిపిస్తుంది.ఈ గిరిజనుల్లో "ఘోటుల్" అనే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఘోటుల్ అనేది యువతీ యువకులు ఒకరినొకరు తెలుసుకునేందుకు, పరస్పరం సమయం గడిపేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలం. సాధారణంగా వీటిని వెదురు బొంగులతో నిర్మిస్తారు. ఈ ప్రదేశాలు యువతకు సామాజికంగా కలిసే అవకాశాన్ని కల్పించే కేంద్రాలుగా ఉపయోగపడతాయి.

35
కలిసి కాపురం.. నచ్చితేనే పెళ్లి..
Image Credit : facebook

కలిసి కాపురం.. నచ్చితేనే పెళ్లి..

స్థానిక ఆచారం ప్రకారం వయస్సు వచ్చిన యువతీ యువకులు ఘోటుల్‌కు వెళ్లవచ్చు. తల్లిదండ్రులే స్వయంగా వారిని అక్కడికి పంపడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా చెబుతారు. అక్కడ యువత ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడం, పాటలు పాడటం, నృత్యాలు చేయడం, తమ అభిరుచులను పంచుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా యువకుడు తనకు నచ్చిన యువతికి వెదురు దువ్వెనను బహుమతిగా ఇస్తాడు. ఆ దువ్వెనను అమ్మాయి తలలో గుచ్చుతాడు. యువతికి కూడా అతనిపై ఆసక్తి ఉంటే ఆ దువ్వెనను తన వద్ద ఉంచుకుంటుంది. దీనిని పరస్పర అంగీకారానికి సంకేతంగా భావిస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు మరింతగా తెలుసుకోవడం కోసం ఘోటుల్ హౌస్ లో సహజీవనం చేస్తారు, శృంగారంలో కూడా పాల్గొంటారు.

45
గర్భంతోనే పెళ్లిపీటలపై కొందరు మహిళలు..
Image Credit : facebook

గర్భంతోనే పెళ్లిపీటలపై కొందరు మహిళలు..

స్థానిక సంప్రదాయం ప్రకారం పరస్పర అంగీకారంతో యువతీ యువకులు వివాహానికి ముందు సంబంధాన్ని కొనసాగించవచ్చు. కొంతకాలం కలిసి గడిపిన తర్వాత కూడా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టమే ఉంటే, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారి వివాహం జరుగుతుంది. ఈ సంప్రదాయం కారణంగా కొన్ని సందర్భాల్లో వివాహానికి ముందే మహిళలు గర్భం దాల్చిన సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయని స్థానికంగా చెబుతారు. చాలామంది గర్భంతోనే పెళ్లిపీటలు ఎక్కుతారని సమాచారం.

55
వింత ఆచారం వల్ల ఎన్నో ఉపయోగాలట..
Image Credit : facebook

వింత ఆచారం వల్ల ఎన్నో ఉపయోగాలట..

ఈ ఆచారం వల్ల యువత తమకు అనుకూలమైన జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని స్థానికులు భావిస్తారు. అలాగే లైంగికతపై ఉండే అపోహలు తగ్గడంతో పాటు పరస్పర అంగీకారానికి ఇంపార్టెన్స్ పెరుగుతుందని కూడా చెబుతారు. ఈ కారణంగా తమ సమాజంలో లైంగిక వేధింపులు చాలా అరుదుగా ఉంటాయని స్థానికుల అభిప్రాయం. 

అయితే గిరిజన సమాజాల ఆచారాలు ప్రాంతానికొక విధంగా మారుతూ ఉంటాయని, అన్ని గిరిజన తెగలు ఒకే విధమైన సంప్రదాయాలను అనుసరిస్తాయని భావించడం సరైంది కాదని నిపుణులు సూచిస్తుంటారు. ఘోటుల్ సంప్రదాయం కూడా ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన కొన్ని గిరిజన తెగల సామాజిక, సాంస్కృతిక జీవన విధానంలో భాగంగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యవస్థగా గుర్తించబడుతోంది. ఈ సంప్రదాయం ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఓసారి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి చాలు
Recommended image2
Frogs: ఈ దేశంలో పాలల్లో బతికి ఉన్న కప్పలు వేస్తారు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Salary: ఆఫ్రికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత ఉంటుంది? ఫీజులు ఎంత వసూలు చేస్తారో తెలుసా?
Related Stories
Recommended image1
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Recommended image2
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved