MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?

Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?

Nagababu: అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంటారు మెగా బ్రదర్స్. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక్క మాటమీదే ఉంటారు. అన్న తిట్టినా భరిస్తుంటారు.. నాగబాబు చిరంజీవితో ఎన్నోసార్లు తిట్లుతిన్నారు. తిట్టిన తరువాత ఏం చేస్తారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో రాణించిన మెగా బ్రదర్స్..
Image Credit : our own

ఇండస్ట్రీలో రాణించిన మెగా బ్రదర్స్..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. చిరంజీవి ఎంతో కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఎన్నో అవమానాలు దాటుకుని స్టార్ గా ఎదిగాడు. ఆయన తరువాత నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అవ్వలేకపోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆయన్ను మించిన ఇమేజ్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎంగా పవన్ స్థాయి వేరే లెవల్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్న చిరంజీవి మాటే ఫైనల్..
Image Credit : our own

అన్న చిరంజీవి మాటే ఫైనల్..

ఏ విషయంలో అయినా ముగ్గరు మెగా అన్నాదమ్ములు ఒకే మాట మీద ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి మాటంటే తమ్ముళ్లు ఇద్దరు వేదంలా భావిస్తారు. ఏ స్థాయిలో ఉన్న నాగాబాబు, పవన్ కళ్యాణ్ లో చిరంజీవి అంటే భయం, భక్తి రెండు ఉంటాయి. మెగాస్టార్ కోపంలో తిట్టినా ఒక్క మాట అనకుండా భరిస్తుంటారు. చిరంజీవి కూడా తమ్ముళ్లను అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. ఏదైనా విషయంలో కోపంతో రెండు మాటలు అన్నా.. ఆతరువాత దగ్గరికి తీసుకోవడం ఆయనకు అలవాటు.

Related Articles

Related image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Related image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
35
నాగబాబుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన చిరంజీవి..
Image Credit : social media

నాగబాబుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన చిరంజీవి..

మెగా బ్రదర్స్ లో చిరంజీవితో ఎక్కువగా చీవాట్లు తినేది నాగుబాబే. ఆయనంటే చిరంజీవికి చాలా ప్రేమ.. మెగా బ్రదర్ ఏ తప్పుచేసినా.. గట్టిగానే ఇచ్చుకుంటారట. చాలా విషయాల్లో అన్న చేత చీవాట్లు తిన్నానని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పుకున్నారు. నాగబాబు మాట్లాడుతూ.. '' అన్నకు నేనంటే చాలా ఇష్టం అందుకే ఆయన తిట్టినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పం. ఓ సారి ఏదో ఇష్యూలో ఫోన్ చేసి చెడా మడా తిట్టేశాడు, లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు.. తిడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. కానీ అప్పుడు మాత్రం ఏంటన్నయ్య అలా తిడతావ్ అని అనేశాను. మళ్లీ చెడా మడా తిట్టేసి ఫోన్ పెట్టేశారు. కొద్ది సేపటికి ఫోన్ చేసి.. సర్లే.. ఇంటికి రా మాట్లాడుకుందాం అని పిలిచారు.'' అన్నయ్య ప్రేమ అలా ఉంటుంది.

45
తండ్రి తరువాత తండ్రిలా..
Image Credit : youtube/tfpc

తండ్రి తరువాత తండ్రిలా..

అన్నయ్య చిరంజీవి ప్రేమ మా తండ్రి తరువాత తండ్రిలా ఉంటుంది అన్నారు నాగబాబు. ఆయన కోపం వస్తే ఎంతలా తిడతారో.. అంతకంటే రెట్టింపు ప్రేమ చూపిస్తారు. ఎప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. తమ్ముళ్లంటే ఆయనకు చాలా ప్రేమ.. అని నాగబాబు అన్నారు. మాకు ఇంత వయసు వచ్చింది.. మా పిల్లలు కూడా పెద్దవాళ్లు అయ్యారు.. హీరోలు అయ్యారు.. అయినా సరే మేం తప్పుచేస్తే .. అన్న చేతుల్లో చిన్నపిల్లలా తిట్లు తినాల్సిందే అని అన్నారు నాగబాబు.

55
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం..
Image Credit : our own

చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం..

నాగబాబు ఒక్కడికే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా అన్న చిరంజీవి అంటే ఎంతో ప్రేమ. చిరంజీవిపై తన అభిమానాన్ని చాలా సందర్భాల్లో చాటుకున్నాడు పవర్ స్టార్. చిరంజీవి సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుర్రాడు. మెగాస్టార్ పిల్లలతో కలిసి పవన్ పెరిగాడు. పవన్ ను చిరంజీవే పెంచి, చదివించారు. చిరంజీవి భార్య సురేఖ సలహాతోనే పవన్ ను సినిమాల్లోకి తీసుకొచ్చారు. అందుకే అన్నా వదినలను తల్లీ తండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటాడు పవన్. 

తన చిన్న కొడుక్కి అన్న, అమ్మ పేరు కలిసొచ్చేలా నామకరణం చేశాడు పవన్. తాను ఎన్నికల్లో గెలిచిన తరువాత చిరంజీవికి స్టేజ్ పైనే కాళ్లకు నమస్కారం చేశాడు, ఇంటికి వచ్చి అన్నా వదిన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇలా మెగా బ్రదర్స్, ఫ్యామిలీ అంతా ఇప్పటికీ తమ అనుబంధం చాటుకుంటున్నారు. ఇండస్ట్రీలోకూడా మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు, నిర్మాతలు ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా మెగా ప్యామిలీ సత్తా చాటుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ట్రైలర్ చూసి సమంత మూవీ జాతకం చెప్పేసిన అఖిల్, మా ఇంటి బంగారంపై షాకింగ్ కామెంట్స్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Recommended image3
Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Related Stories
Recommended image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved