MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మీ పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతున్నారా? అయితే ప్రభుత్వం నుండి ఫ్రీగా రూ.125000 పొందండి

మీ పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతున్నారా? అయితే ప్రభుత్వం నుండి ఫ్రీగా రూ.125000 పొందండి

OBC, EBC, DNT కేటగిరీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం PM-YASASVI స్కీమ్ ద్వారా రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవంబర్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు.

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 21 2026, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ స్కీమ్
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ స్కీమ్

పాఠశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పీఎం యశస్వి స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. చదువుకోవాలని ఆశ ఉన్నా ఆర్థిక సమస్యలతో చదువు మానేయాల్సిన పరిస్థితిలో ఉన్న విద్యార్థులకే ఈ స్కాలర్ షిప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EBC), డీనోటిఫైడ్ తెగలు (DNT) విద్యార్థులకు ఏడాదికి రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.

9, 10, 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఈ స్కాలర్ షిప్ పొందాాలంటే సదరు విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలన్నది ప్రధాన కండిషన్. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నవంబర్ 30 లోగా అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PM-YASASVI స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?
Image Credit : Getty

PM-YASASVI స్కాలర్‌షిప్ అంటే ఏమిటి?

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద అమలయ్యే పథకమే ఈ PM-YASASVI (Prime Minister Young Achievers Scholarship Award Scheme for Vibrant India). సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ చదువును ఆపేయకూడదన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అర్హులైన విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా, చదువు ఖర్చుల భారాన్ని తగ్గించేలా ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు దశల్లో ఈ స్కీమ్ ద్వారా సాయం అందుతుంది.

ఏ తరగతి వారికి ఎంత వస్తుంది?

చదివే తరగతులను బట్టి స్కాలర్‌షిప్ అమౌంట్ మారుతుంది. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.75,000… 11, 12 తరగతుల విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1,25,000 చొప్పున స్కాలర్‌షిప్ దక్కుతుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు లాంటి ఖర్చుల కోసం ఈ డబ్బును ఇస్తారు. అయితే ఎలాంటి కండిషన్స్ లేకుండా మొత్తం డబ్బు నేరుగా అకౌంట్‌లో పడుతుందని అనుకోకూడదు. అర్హత, నిబంధనలను బట్టే డబ్బు మంజూరవుతుంది.

35
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?
Image Credit : Getty

ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

ఈ స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులకు ఈ అర్హతలు ఉండాలి.

1. విద్యార్థి OBC, EBC లేదా DNT కేటగిరీకి చెందిన వారై ఉండాలి.

2. 2026-27 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలి.

3. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి.

4. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో లిస్ట్ చేసిన అర్హత గల స్కూల్‌లో చదువుతూ ఉండాలి.

5. స్కూల్, విద్యార్థి వివరాలను అధికారులు వెరిఫై చేస్తారు.

అమ్మాయిలకు 30 శాతం రిజర్వేషన్

ఈ పథకంలో అమ్మాయిలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం స్కాలర్‌షిప్‌లలో 30 శాతం అమ్మాయిలకే కేటాయించారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల బాలికలు తమ చదువును ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు.

ముఖ్య గమనిక : 9 నుంచి 12వ తరగతి చదివే ప్రతి ఒక్కరికీ ఇది ఆటోమేటిక్‌గా రాదు. సరైన అర్హతలు ఉండి, గుర్తింపు పొందిన స్కూళ్లలో చదివే వారినే ఎంపిక చేస్తారు.

45
దరఖాస్తుకు ఏయే డాక్యుమెంట్లు కావాలి?
Image Credit : Gemini AI సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

దరఖాస్తుకు ఏయే డాక్యుమెంట్లు కావాలి?

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు.
  • కుల ధ్రువీకరణ పత్రం.
  • కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం.
  • విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలు.
  • మునుపటి తరగతి మార్కుల జాబితా.
  • స్కూల్ ఐడీ కార్డు లేదా అడ్మిషన్ వివరాలు.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తదితర వివరాలు.

ఈ డాక్యుమెంట్ల జాబితా అధికారిక వెబ్‌సైట్ నిబంధనల ప్రకారం మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక మార్గదర్శకాలను ఒకసారి చెక్ చేసుకోవాలి.

55
లాస్ట్ డేట్ ఎప్పుడు?
Image Credit : Getty

లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి నవంబర్ 30, 2026 చివరి తేదీ అని నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ తెలిపింది.

- విద్యార్థులు అప్లై చేయడానికి లాస్ట్ డేట్: 30.11.2026

- తప్పులు సరిచేసుకోవడానికి లాస్ట్ డేట్: 15.12.2026

- స్కూల్స్ వెరిఫికేషన్‌కు లాస్ట్ డేట్: 15.12.2026

- జిల్లా/రాష్ట్ర స్థాయి వెరిఫికేషన్ లాస్ట్ డేట్: 31.12.2026

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పై చదువులకు ఖర్చులు పెరుగుతున్నందున ఈ స్కాలర్‌షిప్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ ఈ పథకానికి అర్హత సాధించిందో లేదో ముందే చెక్ చేసుకోండి. చివరి నిమిషం వరకు ఆగకుండా త్వరగా అప్లై చేసుకోండి.

ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొండి

గతంలో లబ్ధి పొందినవారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన https://scholarships.gov.in/ వెబ్ సైట్ లో రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈసారి 9, 11 తరగతుల విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇదే వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
368
INDIND
(125.0 ov)486/4
Day 3
Schedule ›
31st T20 • WBBLT20
BH-WBH-W
Sun, 22 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
MS-WMS-W
Sun, 22 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Books City: మన దేశంలో పుస్తకాల నగరం అని దేన్ని పిలుస్తారో తెలుసా? ఇక్కడ అడుగడుగునా బుక్స్ షాపులే!
Recommended image2
Longest Beach in India: భారత్‌లో అతి పొడవైన బీచ్ ఇదే.. కానీ ఆ ఒక్క పని చేస్తే మాత్రం డేంజర్
Recommended image3
మన ముక్కు వేల వాసనలను ఎలా గుర్తిస్తుంది? వాసనతో పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తుకువస్తాయో తెలుసా?
Related Stories
Recommended image1
Azim Premji Scholarship : తెలుగమ్మాయిలకు బంపరాఫర్ ... ఫ్రీగా రూ.30,000 ఆర్థికసాయం, ఎలా పొందాలో తెలుసా?
Recommended image2
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved