MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • O Pilaga Yenkati : విదేశీ పబ్బుల్లోనూ దుమ్ములేపిన తెలంగాణ జానపదం.. ఓ పిలగ యెంకటేశు ఫుల్ లిరిక్స్

O Pilaga Yenkati : విదేశీ పబ్బుల్లోనూ దుమ్ములేపిన తెలంగాణ జానపదం.. ఓ పిలగ యెంకటేశు ఫుల్ లిరిక్స్

‘’ఓ పిలగ యెంకటేశు.. ఓ పిలగ యెంకటేశు… సితురాల మనసునాది సిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో'' అంటూ అచ్చతెలంగాణ యాసలో సాగే ఈ జానపదం యూట్యూబ్ ను షేక్ చేసింది. ఎన్ని కోట్ల వ్యూస్ సాధించిందో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 25 2026, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సూపర్ హిట్ తెలంగాణ ఫోక్ సాంగ్..
Image Credit : Screenshot to Bhavya Tunes Youtube Channel

సూపర్ హిట్ తెలంగాణ ఫోక్ సాంగ్..

Telangana Folk Song : ప్రస్తుతం తెలంగాణ జానపదాలకు మంచి ఆదరణ లభిస్తోంది... సినిమా పాటలకు మించి హిట్ అవుతున్నాయి. ''రాను బొంబైకి రాను'' అంటూ రాము రాథోడ్ చిందులేసినా... ''మామిడీ కోనాల మీన మబ్బులేమొ నిలిసినాయి'' అంటూ నాగదుర్గ నాజూకు స్టెప్పులేసినా ప్రజలు మైమరచిపోతున్నారు. అయితే కేవలం తెలుగు ప్రజలతోనే కాదు భాష తెలియని విదేశీయులతో కూడా స్టెప్పులేయించిన సాంగ్ ఒకటుంది... అదే 'ఓ పిలగ యెంకటేశు'.

ఓ అమ్మాయి తన ప్రియుడికి  తన అందాలను వర్ణిస్తూ అచ్చ తెలంగాణ యాసలో సాగే జానపదమిది. అలనాటి జానపదానికి సరికొత్త మ్యూజిక్ యాడ్ చేసి నేటి యువతను ఆకట్టుకునేలా రూపొందించి యూట్యూబ్ లో విడుదలచేశారు. ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది... యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించింది. ఏకంగా 367 మిలియన్లు అంటే 367,770,066 కోట్ల వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ సాంగ్ గా నిలిచింది. ఇలా యూట్యూబ్ ను షేక్ చేసిన తెలంగాణ పోక్ సాంగ్స్ లో ఇది టాప్ లో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విదేశీ పబ్బుల్లో మారుమోగిన సాంగ్...
Image Credit : Screenshot to Bhavya Tunes Youtube Channel

విదేశీ పబ్బుల్లో మారుమోగిన సాంగ్...

దాదాపు రెండేళ్లకింద విడుదలైన ఈ "ఓ పిలగ యెంకటేశు..'' సాంగ్ అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏ రీల్స్ చూసినా ఈ సాంగే... ఏ పెళ్లి వేడుక, బారాత్ లో చూసినా ఈ పాటపైనే చిందులే.. ఇలా ఓ రేంజ్ లో ప్రజల్లోకి వెళ్లింది. చివరకు తెలుగు భాష తెలియనివారు కూడా ఈ మ్యూజిక్ కు ఫిదా అయిపోయారు... విదేశాల్లోని పబ్బుల్లో కూడా ఈ యెంకటేశు సాంగ్ వినిపించింది. అప్పట్లో ఈ పాటపై విదేశీయులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

ఇలా ఓ తెలంగాణ జానపదాన్ని మరో మెట్టుకు తీసుకెళ్ళిన సాంగ్ ఇది. ఎక్కడ వల్గారిటీ లేకుండా అమ్మాయి, అబ్బాయి మధ్య సరదా సరసాన్ని అద్భుతమైన మాటలతో వినసొంపుగా ఉంటుంది ఈ 'ఓ పిలగ యెంకటేశు' సాంగ్. అందుకే చిన్నాపెద్ద అని తేడాలేకుండా అందరికీ నచ్చింది... ప్రపంచస్థాయిలో అభిమానులను సంపాదించుకుంది.

33
ఓ పిలగ యెంకటేశు సాంగ్ పూర్తి లిరిక్స్...
Image Credit : Screenshot to Bhavya Tunes Youtube Channel

ఓ పిలగ యెంకటేశు సాంగ్ పూర్తి లిరిక్స్...

ఓ పిలగ యెంకటేశు…

ఓ పిలగ యెంకటేశు…

సితురాల మనసునాది సిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో

ఇంట్ల సిన్నదాన్ని నేను సితురాల దాన్నిరో సిన్నెలు సూపిస్తవో

సితురాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో

ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలు సూపిస్తవో

ఓ పిలగ యెంకటేశు సూడక బోతుంటవో కానక బోతుంటవో..

నా పిలగా యెంకటేశు సూడక బోతుంటవో కానక బోతుంటవో

ఆ.. అందాల గుమ్మ నేను ఆగక పోతున్నవో అలుసుగా సూస్తున్నవో

నీ సొమ్మేమన్నడిగిన్నా సోకులవడుతున్నవో సొమ్మసిల్లి పోతవో

నీయెంట తిరుగుతున్ననాని అలుసైపోతున్ననా... నువ్వేగావాలనొస్తే నన్నేగాదంటావా...

ఓ పిలగ.. ఓ పిలగ..

యహ ఓ పిలగ యెంకటేశు సూడక బోతుంటవో కానక బోతుంటవో

నా పిలగా యెంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో

ఏ కండ్లకు కాటూక బెడితే కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి...

బొమ్మలనడుమ బొట్టువెడితె పల్లెతనంగుంటను నిన్నే ఇడిసిపెట్టను

అవ్వయ్యకు సిన్నదాన్ని సివంగీ పిల్లను... సిన్నచూపు చూస్తె నిన్ను నేను ఇడిసిపెట్టను

ఓ పిలగ.. అరెరే ఓ పిలగ..

అమ్మో ఓ పిలగ యెంకటేశు సూడక బోతుంటవో కానక బోతుంటవో

నా పిలగ యెంకటేశు సూడక బోతుంటవో కానక బోతుంటవో

యహె మనవూరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె నేనురో...

ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే గోరుకుంటిరో నీతోనె ఒస్తనంటిరో

నువ్వే నాపానమంటి నీతోనే బతుకంటి.. నిన్నిడిసీ ఉండలేను నీ యెంటే వస్తా.. నీ యెంటే వస్తరో..

ఓ పిలగ యెంకటేశు…

ఓ పిలగ యెంకటేశు…

ఓ పిలగ యెంకటేశు…

తానానెనన్నానే, తానే నన్నానే

తానానెనన్నానే...

తానానెనన్నానే, తానే నన్నానే

తానానెనన్నానే...

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
వినోదం
సంస్కృతి (Samskruti)
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved